బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

విద్యారంగాన్ని నాశనం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం

విద్యారంగాన్ని నాశనం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం

Revanth Reddy government is destroying the education sector

|| Revanth Reddy government is destroying the education sector ||

– బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

📍 హైదరాబాద్: నీటిపారుదల, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగాలను నాశనం చేసినట్టే రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం ఇప్పుడు విద్యారంగాన్ని కూడా ధ్వంసం చేస్తోందని బీఆర్ఎస్ (BRS) నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.

🔹 విద్యార్థుల మరణాలు – ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం

🔸 పరిగి నియోజకవర్గం కుల్కచర్లలో విద్యార్థి మరణం, బాలానగర్‌లో ఆరాధ్య అనే విద్యార్థిని ఆత్మహత్య ఘటనలు తీవ్రంగా కలిచివేశాయని అన్నారు.
🔸 విద్యార్థుల మరణాలు జరగుతున్నా ప్రభుత్వ పెద్దల్లో చలనం లేకపోవడం దారుణమని విమర్శించారు.
🔸 గురుకులాల్లో (Gurukul Schools) పరిస్థితులు దిగజారిపోతున్నాయని, ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.

🔹 గురుకుల విద్యను నిర్వీర్యం చేస్తున్న రేవంత్ రెడ్డి?

🔹 కేసీఆర్ హయాంలో (KCR Government) ప్రతి గురుకుల సీటుకు ముగ్గురు విద్యార్థులు పోటీ పడేవారని, కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
🔹 గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్షకు 40 వేల సీట్లకు 80 వేల మంది కూడా దరఖాస్తు చేయలేదని, ప్రభుత్వం విద్యా విధానాన్ని గాడితప్పిస్తోందని ఆరోపించారు.
🔹 మూడుసార్లు గడువు పొడిగించినా, విద్యార్థుల నుంచి స్పందన రాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
🔹 ఎంట్రన్స్ టెస్ట్ ఎందుకు తీసేశారని, రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.

🔹 ప్రతిభా పాఠశాలల రద్దు – విద్యార్థులకు తీరని నష్టం

✅ కేసీఆర్ హయాంలో 30కి పైగా ప్రతిభా పాఠశాలలు ఏర్పాటు చేసి, విద్యార్థులను వైద్య, ఇంజినీరింగ్ రంగాల్లో ఉన్నత చదువులకు అభ్యసించేలా చేశారని, ఇప్పుడు ఆ పాఠశాలలను నిర్వీర్యం చేయాలని కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
✅ భువనగిరిలో సైనిక దళాల్లో చేరేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక పాఠశాలను కూడా మూసివేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
✅ గురుకులాల్లో చదివిన విద్యార్థులు డాక్టర్లుగా తయారయ్యారు, కానీ ఇప్పుడు వైద్య విద్య కోసం వెళ్లిన 57 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఘాటుగా వ్యాఖ్యానించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

🔹 బీసీ విద్యార్థులకు న్యాయం చేసేదెవరు?

🔸 గురుకులంలో చదివిన రజక కులానికి చెందిన విద్యార్థిని నందిని, బ్యాడ్మింటన్ నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిందని గుర్తుచేశారు.
🔸 కానీ ప్రభుత్వం ఆమెను ప్రోత్సహించలేదని, ఆమె బీసీ విద్యార్థిని అయినందునే పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
🔸 నందినికి తక్షణమే కోటి రూపాయల నజరానా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

🔹 రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు

🔹 ప్రభుత్వానికి సిరాజ్, జరీన్ లే కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు.
🔹 నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారని, ఈ విషయాన్ని బాహాటంగా చెప్పినందుకే బీఆర్ఎస్ నేతలు, మీడియాపై కేసులు పెట్టారని మండిపడ్డారు.
🔹 ఆ ఇద్దరు విద్యార్థినులను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి రెండు గంటలు విచారించడం దారుణమని ఆరోపించారు.

🔴 “చదువుకోవాల్సిన విద్యార్థినులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లే దుర్మార్గపు పాలన రేవంత్ రెడ్డిదే” అని విమర్శించారు.
🔴 “ఆయన్ను ఎంత తొందరగా ఇంటికి సాగనంపితే అంత మంచిది” అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 🚨