Breaking News

Telangana BJP will soon have a new state president

తెలంగాణ బీజేపీకి త్వరలో కొత్త రాష్ట్ర అధ్యక్షుడు

📍 వరంగల్: రాష్ట్రంలో కులగణన (Caste Census) ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం వరంగల్‌లో పర్యటించిన ఆయన, ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

🔹 కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేకు ఏ ఒక్క బీసీ సంఘం కూడా మద్దతు ఇవ్వడం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
🔹 బీసీ రిజర్వేషన్లకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.
🔹 “కులగణన సర్వే పూర్తయిన తర్వాత బీసీ సంఘాలు ఆమోదిస్తే, కేంద్రాన్ని ఒప్పించి మేము ఆమోదం పొందుతాం.”

🗣 “రాహుల్ గాంధీ కులం గురించి మాట్లాడడం అవసరం లేదు.. ప్రజల అభివృద్ధి కోసం కులగణన చేయాలి.”

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర
  • ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రధాన లక్ష్యమై ఉండాలని సూచించారు.
  • బీజేపీ బీసీ సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

🔹 త్వరలో తెలంగాణ బీజేపీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడు రాబోతున్నారని కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
🔹 స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కొత్త అధ్యక్షుడు నియమితులవుతారని తెలిపారు.
🔹 బిజీ షెడ్యూల్ కారణంగా రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఆలస్యమవుతోందని చెప్పారు.

🔥 “బీఆర్ఎస్, కాంగ్రెస్ కలవాల్సిన అవసరం మాకు లేదు.. కానీ వీరిద్దరి మధ్య అంతర్గత సంబంధం ఉందని అందరికీ తెలిసిందే.”

  • కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అభ్యర్థులను పెట్టేందుకు కూడా భయమని వ్యాఖ్యానించారు.
  • ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందని, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారని ఆరోపించారు.

📉 రాష్ట్రాన్ని దివాళా తీయించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు
  • వనరులను సమకూర్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళిక లేదు.
  • ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు రోడ్‌మ్యాప్ కూడా లేనేలేదని ఆరోపించారు.
  • “ఘాటుగా, ఆవేశంగా మాట్లాడితే ప్రజలు ఎక్కువ రోజులు భరించరు.. ప్రభుత్వ పాలన గుడ్డెద్దు చేనులో పడినట్లుగా మారింది.”

📢 కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలూ ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *