బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

కేంద్ర బడ్జెట్ ఏపీకి నిరాశే మిగిల్చింది: డిసిసి అధ్యక్షుడు గాజుల భాస్కర్

రాయచోటి, ఫిబ్రవరి 1 (నేటి తెలుగు పత్రిక): కేంద్ర ప్రభుత్వంపార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపీకి నిరాశే మిగిల్చిందని డిసిసి అధ్యక్షుడు గాజుల భాస్కర్ అన్నారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు తగిన నిధులు కేటాయించ లేదని పోలవరం కు 57 వేల కోట్ల రూపాయల గ్రాంట్ ను కూటమి రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందని, రాష్ట్ర ప్రజలపై భారం పడుతుందని ఆయన చెప్పారు. గ్రామీణ అభివృద్ధికి నిధులు తగ్గాయని, వైజాగ్ కు హై స్పీడ్ రైట్ కారిడార్ కేటాయింపు జరగాలని ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం పై ఒత్తిడి చేయక పోవడం దురదృష్టకరమన్నారు.ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కు ఏమటకు సరిపోతుందో చెప్పాలని కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా గాజుల భాస్కర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి పోయిన విషయం మీకు తెలుసు. కాబట్టి ఆ మేరకు నవ్యాంధ్రకు న్యాయం చేసేటందుకు సోనియా గాంధీ మార్గ దర్శకత్వంలో, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా నవ్యాంధ్రప్రదేశ్ కు మూడు వరాలు ఇవ్వడం జరిగింది. అందులో మొదటి వరం ఆంధ్రప్రదేశ్ లో ఐదు సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా అమలు చేయడం. దురదృష్టవశాత్తు 11 సంవత్సరాల అయినా ప్రత్యేక హోదా అమలకు నోచుకోలేదని ప్రత్యేక హోదా తోనే రాష్ట్ర అభివృద్ధిని కూటమి నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు. ఇకనైనా ప్రత్యేక హోదాపై నాయకులు పోరాడాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు