టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు భరతు పీక్లా నాయక్.
టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి అలవాల రమేష్ రెడ్డి.
ఎ. కొండూరు ఫిబ్రవరి 1 (నేటి తెలుగు పత్రిక): తెదేపా జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు అప్రజా స్వామికచర్య అనిఎ. కొండూరు మండల టిడిపి పార్టీ అధ్యక్షుడు భరోతు పీక్లా నాయక్ టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి అలవాల రమేష్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా వారు ఆదివారం మండల కేంద్రమైన ఎ. కొండూరు పోలీస్ స్టేషన్ లో వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు పై చర్యలు తీసుకోవాలని ఎస్ ఐ జి.మహాలక్ష్మణుడు కు టిడిపి నాయకులు శ్రేణులతో కలిసి ఫిర్యాదును అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై వాడిన బూతులసంస్కృతిపై వారు మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి రాష్ట్ర ప్రజలు వారిని. వారి పార్టీని తిరస్కరించినప్పటికీకనీసం వైసిపి నాయకుల్లో మార్పు రాకపోవడం వారి నీచ రాజకీయానికి నిదర్శనం అని విమర్శించారు.రాష్ట్రంలో వైసిపి పార్టీ ఒక రాజకీయ పార్టీగా వ్యవహరించడం లేదని ఒక అసాంఘిక శక్తిగా ఎదిగి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని వైసిపి పార్టీ నాయకులు కంకణ బద్ధులై తీవ్రమైన అశ్లీల బూతు పదజాలాన్ని వాడుతున్నారని ఈ సందర్భంగా అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై వారు తీవ్రంగా విమర్శించారు. తెదేపా పార్టీకి చెందిన ఒక సోషల్ మీడియా కార్యకర్త భారతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటికప్పుడు జైలుకు పంపించి చర్యలు తీసుకున్న సంగతి వైసిపి నాయకులు మర్చిపోయార అని వారు ప్రశ్నించారు.ఇప్పుడు అంబటి రాంబాబు ఇంతటి అశ్లీల భాష వాడుతుంటే జగన్ మోహన్ రెడ్డి ఏమి చర్యలు తీసుకుంటారని వారు ప్రశ్నించారు ప్రజాస్వామ్యంలో సంస్కారవంతమైన భాష మాట్లాడాలి కానీ వైసీపీ నేతలు కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం సృష్టించాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.75 ఏళ్ల వయస్సు ఉన్న దేశంలోనే సీనియర్ నాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై అంబటి రాంబాబు వాడిన పదజాలం ఆయన నీచత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు..ఈ కార్యక్రమంలో, కృష్ణారావు పాలెం మాజీ సర్పంచ్ పిన్నమనేని శ్రీనివాసరావు, మండల టిడిపి ప్రధాన కార్యదర్శి, గోగులమూడి రాంప్రసాద్ రెడ్డి, నియోజకవర్గ తెలుగు యువత నాయకులు, పిట్టా చైతన్య, యేలినేని చంద్రశేఖర రావు, గొర్ల రమేష్ రెడ్డి, చీమలపాడు పిఎసిఎస్ అధ్యక్షుడు బెజవాడ శంకర్, షేక్ ఆదం షరీఫ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

