బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

టెక్సాస్‌లో గోల్డ్ పేరుతో భారీ మోసం.. వృద్ధులే టార్గెట్

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో సంచలన గోల్డ్ స్కామ్ బయటపడింది. వృద్ధులను భయపెట్టి ఏకంగా 55 మిలియన్ డాలర్లు (సుమారు రూ.460 కోట్లు) దోచుకున్న ముఠాను పోలీసులు గుర్తించారు.ఈ ముఠా ప్రత్యేకంగా 65 ఏళ్లు దాటిన వృద్ధులనే లక్ష్యంగా చేసుకుంది. “మీ బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి”, “మీపై కేసులు నమోదయ్యాయి” అంటూ ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ ద్వారా బెదిరింపులు చేసేది. సమస్య నుంచి తప్పించుకోవాలంటే తమ మొత్తం సేవింగ్స్‌తో బంగారం లేదా గోల్డ్ బార్లు కొనాలని సూచించేది.

బంగారాన్ని “ప్రభుత్వ భద్రతలో ఉంచుతాం” అంటూ నమ్మించి, కొరియర్ సిబ్బందిలా నటించిన వ్యక్తులను ఇంటికే పంపించి బంగారాన్ని స్వాధీనం చేసుకునేవారు. ఆ తర్వాత ఆ గోల్డ్‌ను జ్యువెలరీ షాపులకు సరఫరా చేసి, తక్కువ ధరకే విక్రయించి వెంటనే కరిగించి విదేశాలకు అక్రమంగా తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ స్కామ్‌లో:

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు
  • ఒక్క కాలిన్ కౌంటీలోనే 200 మందికి పైగా వృద్ధులు మోసపోయారు
  • ఒక బాధితుడు 1 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తిని కోల్పోయాడు
  • ఇప్పటివరకు ముగ్గురు నిందితులు అరెస్ట్
  • భారీగా బంగారం, నగదు సీజ్

ఇర్వింగ్‌లోని ‘తిలక్ జ్యువెలరీ’, ఫ్రిస్కోలోని ‘సైమా జ్యువెలరీ’ కేంద్రంగా ఏడాది పాటు సాగిన ఈ మోసాన్ని పోలీసులు నిఘాతో గుర్తించి మెరుపు దాడులు చేసి ఛేదించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.