Breaking News

మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మంత్రి ఉత్తమ్ కు కానుకగా ఇవ్వాలీ…. కోదాడ 31 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సవం లో ఎమ్మెల్యే పద్మావతి

కోదాడ ఫిబ్రవరి 2 (నేటి తెలుగు పత్రిక): కోదాడ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరాలనీ కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. సోమ వారం కోదాడ మున్సిపల్ పరిధిలోని 31వ వార్డు లో మాజీ సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్నేని వెంకట్ రత్నం బాబు, స్థానిక వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కుసుమ వెంకట్ రత్నం బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయం ప్రారంభించి మాట్లాడారు. జరగబోయే 35 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయ ఢంకా మోగించాలన్నారు. కార్యకర్తలు పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు.స్థానిక 31వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు ను రికార్డు మెజార్టీ తో గెలిపించాలన్నారు.పార్టీ అభ్యర్ధుల గెలుపు కు కృషి చేసే వారందరికీ తప్పక గుర్తిస్తాం అన్నారు. మంత్రి ఉత్తమ్ గాని, తాను కానీ పార్టీ గెలుపు కోసం కృషి చేసే ప్రతి నాయకుడిని, కార్యకర్త ను అన్యాయం చేయం అన్నారు.
పరస్పర సహాకారం సమన్వయం తో పని చేయాలనీ సూచించారు.
మంత్రి ఉత్తమ్ సహాకారం తో కోదాడ ను అభివృద్ధి లో అగ్ర స్థానంలో నిలుపుతా అన్నారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చా అన్నారు.కోదాడ మున్సిపాలిటీ 35 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మంత్రి ఉత్తమ్ కు కానుకగా ఇవ్వాలన్నారు. ప్రత్యర్ధులు ప్రలోభాలకు గానీ మోస పూరిత, అసత్య ప్రచారాలు తిప్పి కొట్టాలన్నారు. 31వ వార్డు లో పరిపాలన అనుభవం, కష్ట పడే మనస్తత్వం ఉన్న ఎర్నేని వెంకట్ రత్నం బాబు సతీమణి కుసుమ బాబునుగెలిపించాలన్నారు. బరిలో ఉన్న అభ్యర్థులు వార్డు లోని నాయకుల ను కార్యకర్తల్ని సమన్వయం చేసుకొని ప్రతి ఓటర్ కలిసి ఓటుఅభ్యర్థించాలన్నారు.ప్రతి ఓటు విలువైనదే అన్నారు. ఎన్నికల పోటీలో నిర్లక్ష్యం వహించ వద్దన్నారు. ఎన్నికల ప్రచారం లో ప్రతిఒక్కరు దూసుక వెళ్లాలన్నారు. మాజీ సర్పంచ్ యెర్నేని వెంకట్ రత్నం బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అభ్యర్థి కుసుమ వెంకటరత్నం బాబు, పట్టణ నాయకులు, స్థానిక వార్డు నాయకులు, కార్య కర్తలు ప్రముఖులు ఉన్నారు.

గీతవృత్తిలో ప్రమాదాలకు గురై గీత కార్మికులకు రావలసిన ఎక్స్ గ్రేషియాలకు నిధులు విడుదల చేయాలి.

క్రీడా పోటీలు మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవి శ్వాసాన్ని పెంపొందిస్తాయి: మంత్రి మండిపల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *