బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

తిరుచానూరు పీఎస్‌లో మోహన్‌బాబు, మంచు విష్ణుపై కిడ్నాప్ కేసు

విద్యార్థి నేతల ఆరోపణలు – యూనివర్సిటీ కౌంటర్ ఫిర్యాదు

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తిరుపతి జిల్లా తిరుచానూరులో జరిగిన విద్యార్థి నేతల కిడ్నాప్ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి మోహన్‌బాబు, మంచు విష్ణు, యూనివర్సిటీ పీఆర్‌వో సతీష్‌లపై తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.

మోహన్‌బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ, అక్రమాలపై ప్రశ్నిస్తూ SFI నేతలు కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమవుతున్న సమయంలో, విద్యార్థి సంఘం నేతలు అక్బర్, వినోద్‌లను యూనివర్సిటీ బౌన్సర్లు బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనను కిడ్నాప్‌గా భావించి CPM నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు కిడ్నాపర్ల వాహనాన్ని చేజింగ్ చేసి మోహన్‌బాబు యూనివర్సిటీ వరకు వెళ్లాయి. అనంతరం నారావారి పల్లె సమీపంలోని మోహన్‌బాబు ఫామ్ హౌస్ వద్ద కిడ్నాప్‌కు గురైన విద్యార్థి నేతలను పోలీసులు గుర్తించారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

ఈ ఘటనకు నిరసనగా విద్యార్థి సంఘాల నేతలు తిరుచానూరు పీఎస్ ముందు ధర్నా చేపట్టారు. కాలేజీలో జరుగుతున్న అక్రమాలను బయటపెడితే విద్యార్థి నేతలను కిడ్నాప్ చేస్తారా? ఇదేనా విద్యా సంస్థల విలువలు? అంటూ వారు యాజమాన్యాన్ని నిలదీశారు.

యూనివర్సిటీ నుంచి కౌంటర్ ఫిర్యాదు

ఇదిలా ఉండగా, యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని విద్యార్థి సంఘాల నేతలపై యూనివర్సిటీ పీఆర్‌వో సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాజమాన్యాన్ని డబ్బులు డిమాండ్ చేశారంటూ ఆరోపణలు చేశారు. ఈ మేరకు విద్యార్థి నేత అక్బర్ సహా మరికొందరిపై చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది.