Breaking News

హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌కు నగరంలో మరో రెండు కొత్త టూరిస్ట్ అట్రాక్షన్లు!

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: వీకెండ్ వచ్చిందంటే ఎక్కడికి వెళ్లాలా అని తలనొప్పి పడుతున్నారా? ఫ్రెండ్స్‌తోనో, ఫ్యామిలీతోనో ప్రశాంతంగా టైమ్ స్పెండ్ చేయాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్. నగరంలో త్వరలోనే రెండు కొత్త టూరిస్ట్ స్పాట్స్ అందుబాటులోకి రానున్నాయి.

హైదరాబాద్ టూరిజానికి మరో కొత్త హై

చార్మినార్, గోల్కొండ, నెహ్రూ జూ పార్క్, ట్యాంక్‌బండ్ లాంటి పర్యాటక ప్రదేశాలతో హైదరాబాద్ ఇప్పటికే టూరిజం హబ్‌గా ఉంది. అయితే వీకెండ్స్‌లో ఈ ప్రాంతాలు జనాలతో కిక్కిరిసి పోతుండటంతో, కొత్తగా రిలాక్స్ అయ్యే ఆప్షన్ల అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో తెలంగాణ టూరిజం శాఖ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది.

ట్యాంక్‌బండ్‌లో హౌజ్ బోట్ల అందుబాటు

హుస్సేన్ సాగర్‌లోని ట్యాంక్‌బండ్‌లో ఇప్పటికే బోటింగ్ ఫెసిలిటీ ఉంది. ఇకపై అక్కడ హౌజ్ బోట్స్ కూడా ప్రవేశపెట్టనున్నారు. ఈ బోట్లలో రెండు డబుల్ బెడ్‌రూమ్స్‌తో పాటు ఫుడ్ సర్వీస్, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. నీటిపై తేలియాడుతూ ఇంట్లో ఉన్న ఫీల్‌తో వీకెండ్‌ను ఎంజాయ్ చేయొచ్చు.

రాయచోటి మున్సిపాలిటీ త్రాగునీటి కోసం రూ.150 కోట్లు కేటాయించాలని ప్రతిపాదన.

దుర్గం చెరువులో 6 హౌజ్ బోట్స్

ఇదే తరహాలో దుర్గం చెరువులో కూడా ఆరు హౌజ్ బోట్స్ ప్రారంభించనున్నారు. ఒక్కో బోటులో రెండు డబుల్ బెడ్‌రూమ్స్ ఉండటంతో మొత్తం 12 బెడ్‌రూమ్స్ అందుబాటులోకి వస్తాయి. ఈ బోట్ల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే అంశంపై ప్రభుత్వం పరిశీలన చేస్తోంది.

నగరవాసులకు కొత్త అనుభూతి

వీకెండ్‌లలో నగరంలోని టూరిస్ట్ స్పాట్స్ జనాలతో నిండిపోతున్న నేపథ్యంలో ఈ హౌజ్ బోట్స్ మంచి ఆకర్షణగా నిలుస్తాయని పర్యాటక శాఖ భావిస్తోంది. వీటి రాకతో హైదరాబాద్ ప్రజలకు కొత్త రకమైన విహార అనుభూతి లభించనుంది.

👉 మొత్తంగా చూస్తే… హైదరాబాదీలకు వీకెండ్ ఎంజాయ్‌మెంట్ ఇక మరింత స్పెషల్ కాబోతోంది 😍

శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ప్రభుత్వ విప్ శాసన సభ్యురాలు గొంగిడి సునీత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *