బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సమాచార కమిషనర్ దేశాల భూపాల్

నేటి తెలుగు పత్రిక: సమాచార హక్కు చట్టం సాధన కమిటీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని హైదరాబాద్ మీర్ పేట లో సమాచార కమిషనర్ దేశాల భూపాల్ తో పాటు సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశాల భూపాల్ మాట్లాడుతూ పాలనలో పారదర్శకత కోసమే 2005 లో సమాచార హక్కు చట్టాన్ని తెచ్చారని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్‌ను తప్పనిసరిగా ప్రదర్శించాలని అన్నారు.సమాచార హక్కు చట్టం పౌరులకు పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన అందించడంలో కీలకమైన సాధనమని అన్నారు.ఆర్టీఐ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లాల్లో పర్యటనలు చేపడుతున్నామని పేర్కొన్నారు.పారదర్శకమైన పాలన కోసం చట్టం ఉపయోగపడాలని, ప్రజలు చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా సదుద్దేశంతో వినియోగించుకోవాలన్నారు.అధికారులు చట్టం పట్ల భయం విడనాడి నిర్భయంగా యాక్ట్ ప్రకారం అడిగిన సమాచారాన్ని నిర్ణీత సమయంలో అందజేయాలని తెలిపారు. చట్టం అమలులో మన దేశం ప్రపంచ స్థాయిలో 8వ స్థానంలో ఉన్నదని, రాబోయే రోజులలో నెంబర్ వన్‌గా నిలిపేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సూరస్రవంతి, జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం, జాతీయ ఉపాధ్యక్షులు గోపీనాథన్ కట్టెకోలా, రాష్ట్ర కార్యదర్శి కడమంచి అజయ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల మల్లేష్, రంగారెడ్డి జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు పి.రాజు గౌడ్, రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి చైతన్య, కమ్మరి రమేష్,అరుణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు