Breaking News

కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కాయం

  • యాదగిరిగుట్ట టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు నరసింహ గౌడ్.

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 04 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్టలో 12 వార్డులో ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ జిల్లా అధ్యక్షులు బిర్లా ఐలయ్య గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 12 మంది అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని యాదగిరిగుట్ట టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు నరసింహ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా గుండు నరసింహ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి ,లాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మహిళా శక్తి పథకం ద్వారా వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు మంజూరు చేసిందని అన్నారు. గోదావరి జనాల ద్వారా ఆలేరు నియోజకవర్గానికి నీళ్లు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారికె దక్కిందని గుండు నరసింహ గౌడ్ అన్నారు.

ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ సత్య జన్మదిన వేడుకలు

ఎల్‌పీజీ కొరతపై కేంద్రానికి రాష్ట్ర విజ్ఞప్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *