బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

ప్లాస్టిక్ రహిత ఆహారాలతో కాన్సర్ నియంత్రణ సాధ్యం: డాక్టర్ సుకన్య

పులివెందుల ఫిబ్రవరి 4 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): పొగాకు, ప్లాస్టిక్ రహిత ఆహారాలతో కాన్సర్ నియంత్రణ సాధ్యం అని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రముఖ సర్జన్ వైద్యులు డాక్టర్ సుకన్య పేర్కొన్నారు. ప్రపంచ కాన్సర్ దినం సందర్బంగా పులివెందుల పట్టణం లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లలో ఎన్ఎస్ఎస్ యూనిట్ 1&2 మరియు స్నేహిత అమృత హస్తం సేవాసమితిల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థినిలకు కాన్సర్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్ సుకన్య మాట్లాడుతూ ప్రస్తుత కాలక్రమేణా మనిషి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణ మార్పులు మానవాళి మనుగడ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి అని,పురుషులలోను, మహిళలలోనూ శరీరం లో వచ్చే కాన్సర్ ల రకాలను వివరించారు. అలాగే కాన్సర్ వచ్చే మార్గాలు, కాన్సర్ గుర్తించే పద్ధతులు, కాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కాన్సర్ నియంత్రణ మార్గాలను వివరించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపల్ శ్రీనివాసులు మాట్లాడుతూ కాన్సర్ ప్రాణాంతకంగా మారుతోంది అని అందుకు కారణం మనం నిత్యం తీసుకునే జంక్ ఫుడ్, ఫాస్ట్ లే ప్రధాన కారణం అని మంచి ఆహారపు అలవాట్లను అలవరచుకోవాలన్నారు. కాన్సర్ పై అవగాహనతో కాన్సర్ రహిత సమాజం నిర్మిద్దాం అని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో వైస్ ప్రిన్సిపల్ బాలనారాయణ,ఎన్ఎస్ఎస్ యూనిట్ 1&2 ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ శ్రీ నిత, శ్రీనివాసులు, స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షులు రాజు, కళాశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు