Breaking News

రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ గుడ్‌న్యూస్ 🎉

ముహూర్తం ఫిక్స్.. రైతుల అకౌంట్లో డబ్బులు అప్పుడే!

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ శుభవార్త అందించారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులు, అలాగే కొత్త ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై సీఎం స్పష్టత ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. అలాగే కొత్త ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత లబ్దిదారుల జాబితాపై కూడా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో రైతులు రైతు భరోసా నిధుల కోసం నెలలుగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి ముందు జమ అవుతాయని భావించినప్పటికీ, నిధుల విడుదల ఆలస్యమైంది. ఫిబ్రవరి తొలి వారంలోనైనా వస్తాయని ఆశించిన రైతులకు నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో నిధుల విడుదలపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

రాయచోటి మున్సిపాలిటీ త్రాగునీటి కోసం రూ.150 కోట్లు కేటాయించాలని ప్రతిపాదన.

రైతు భరోసా డబ్బులు ఎప్పుడంటే..?

మిర్యాలగూడ మండలం గూడూరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ కారణంగానే ప్రస్తుతం నిధులు విడుదల చేయలేకపోతున్నామని తెలిపారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే డబ్బులు జమ చేస్తామన్నారు.రైతుల కోసం ఇప్పటివరకు రూ.1.10 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశామని సీఎం తెలిపారు. అలాగే రైతులు పండించే సన్నబియ్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ను నిరంతరం అందిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.తెలంగాణలో ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా, ఫిబ్రవరి 13న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి చివరి నాటికి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితా ఎప్పుడంటే..?

కొత్త ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ నెల నుంచి కొత్త ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. త్వరలోనే రెండో విడత లబ్దిదారుల జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. రానున్న బడ్జెట్‌లో ఇందుకు అవసరమైన నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు.రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఐదేళ్లలో అర్హులైన అందరికీ ఇళ్లు అందిస్తామని భరోసా ఇచ్చారు.మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓటు వేయాలని సీఎం కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ప్రభుత్వ విప్ శాసన సభ్యురాలు గొంగిడి సునీత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *