విజయవాడ నేటి తెలుగు పత్రిక: 2029 ఎన్నికల్లో “రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్” ప్రత్యామ్నాయ రాజకీయ పార్టి కాభోతుందని ఆ పార్టీ అధినేత మేడా శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పాలకుల పనితీరు ఆంధ్రులను భయ పెడున్నాయని, కక్ష పూరిత రాజకీయాలు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రయోజ నాలకు ఏ మాత్రం ఉపయో గం లేకపోతుందన్నారు.ఆంధ్రప్రదేశ్ లో గల 175 శాసన సభ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కమిటీలను ఏర్పాటు చేసే దిశగా అర్పిసి ఆంధ్రప్రదేశ్ శాఖ శ్రీకారం చుట్టిందన్నారు. ఓటును ఇవ్వండి. సంపదను ఇస్తాం అనే నినాదంతో పేదరికం లేని సంపన్న రాష్ట్రాన్ని సాధించి చింపిస్తాం అన్నారు. ప్రధానంగా ప్రైవేట్ విద్యా వైద్య విధానాన్ని పూర్తిగా రద్దు చేసి అదునాతన విధానాలతో ఉచిత విద్యా వైద్యాన్ని అమలు చేస్తాం, 200/- లకే వంటగ్యాస్ సిలెండర్ ను సరఫరా చేస్తాం, పరిశుభ్ర మైన త్రాగునీటిని ఉచితం గా సరఫరా చేస్తాం అని ఈ దిగువ పేర్కొన్న 29 అంశాలతో కూడిన ప్రమాణ పత్రాన్ని మేడా శ్రీనివాస్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మీడియా అర్పిసి సెక్యులర్స్ సర్వడా. కొమ్మజు రమేష్, పంగులూరి బుచ్చి బాబు, మాజీ మున్సిపల్ కమిషనర్ డా. చదలవాడ హరి బాబు, పెండ్యాల కామ రాజు, సిమ్మా దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
