విజయవాడ, ఫిబ్రవరి 5 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: దివ్యంగుల సంక్షేమానికి తగిన నిధులు కేటాయిం చాలని అధ్యక్షులు లక్ష్మీ నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ బడ్జెట్ సమావేశాల జరగ నున్న నేపథ్యంలో రాష్ట్రంలో లక్షల సంఖ్యలో దివ్యాం గులు నేటికీ జీవనో పాధి విద్యా, వైద్యం రవా ణా ఉపాధి అవకాశాల విష యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇచ్చిన హామీలు పూర్తి కాక దివ్యాంగుల జీవితం అం తంత మాత్రంగా ఉన్న దని రాబోయే బడ్జెట్ లో దివ్యాంగులకు తగిన నిధు లు కేటాయించాలని దివ్యాంగులకు ప్రత్యేకమైన శాఖను ఏర్పాటు చేసి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి. ఎంపీ, ఎమ్మెల్యే నిధులలో దివ్యంగులకు కేటాయిం చిన నిధులను విడుదల చేసి వారి సౌకర్యార్థం విని యోగించాలని. అన్ని ప్రభు త్వ శాఖలలో బ్యాక్లాగ్ పోస్టులు రిక్రూట్మెంట్ అమ లు చేయాలని, త్రీవీలర్ వెహికల్ వయసు చదువు తో సంబంధం లేకుండా ఏర్పాటు చేయాలని కోరా రు. దివ్యాంగులను కించప రిచేలా మాట్లాడటం నేరమ ని దివ్యంగుల చట్టo 2016 సెక్షన్ 92 ప్రకారం అవమానించిన, దాడి చేసిన వారిని జైలు శిక్షతో పాటు భారీ మొత్తంలో జరిమానా విధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కందుల సురేష్, కొమ్మల కోటేశ్వరరావు, ఆర్.శంకర్ నాయక్, అందు లో సురేష్ యాదవ్ మాది రెడ్డి రాంప్రసాద్, సత్యనా రాయణ రాంబాబు తదిత రులు పాల్గొన్నారు.
