బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

ఏపీకి కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్..!

ఏపీకి కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్..!

విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నల్ – సీఎం చంద్రబాబుకు కేంద్రం హామీ

నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా విశాఖ వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే విశాఖ మెట్రో ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం తెలిపినట్లు కేంద్రమంత్రి స్వయంగా సీఎం చంద్రబాబుకు తెలియజేసినట్టు సమాచారం.


గతంలో పంపిన ప్రతిపాదనలకు ఎట్టకేలకు ఆమోదం

ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘంగా పరిశీలించిన అనంతరం, తాజాగా విశాఖ మెట్రో ప్రాజెక్టుకు మాత్రమే అధికారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.విశాఖలో మెట్రో ఏర్పాటుతో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు, నగరాభివృద్ధికి మరో ఊపొస్తుందని భావిస్తున్నారు.


ఢిల్లీలో వరుసగా కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీలు

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు వరుసగా కీలక కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు.
👉 ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
👉 అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ సమావేశం నిర్వహించారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

ఈ భేటీల్లో రాష్ట్రాభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర నిధులు, పెండింగ్ అంశాలపై సీఎం చంద్రబాబు విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.


విశాఖ ప్రజలకు శుభవార్త

విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం రాష్ట్రాభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుంది. ఇక త్వరలోనే డీపీఆర్, నిధులు, పనుల ప్రారంభంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.