యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 10 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆత్మకూర్‌లో మాజీ ఎంపీపీ కీర్తిశేషులు జన్నాయికొడే అమృతమ్మ – శంకరయ్య గార్ల స్మారకార్థం వారి కుమారులు , మాజీ నేతాజీ యువజన మండలి అధ్యక్షులు జన్నాయికోడే యుగంధర్ మరియు మాజీ సర్పంచ్ జన్నాయికోడే నగేష్ గార్ల సహకారంతో నేతాజీ యువజన మండలి, శివాజీ యువజన మండలి , జే ఏ ఎస్ గార్డెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మండల స్థాయి పాఠశాలల సాంస్కృతిక కార్యక్రమాల కరపత్రాలను విడుదల చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన మండలి అధ్యక్షులు దొంతరబోయిన మురళీ కృష్ణ,శివాజీ యువజన మండలి ప్రధాన కార్యదర్శి తొండల అనిల్ కుమార్ గౌడ్,మాజీ పి.ఏ.సి.ఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ జన్నాయికొడే నగేష్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు గజరాజు కాశీనాథ్,శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గుండెగాని ఐలయ్య,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతగాని మల్లేష్,బీజేపీ పట్టణ అధ్యక్షులు లోడి వెంకటయ్య, సి.పి.ఐ పట్టణ కార్యదర్శి మజ్జిగ నర్సయ్య, బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు కోరే బిక్షపతి, బీజేపీ జిల్లా నాయకులు బండారు సత్యనారాయణ, బొబ్బల ఇంద్రారెడ్డి, సి.పి.ఐ నాయకులు సుల్తాన్ పురుషోత్తం,మాజీ నేతాజీ యువజన మండలి అధ్యక్షులు జన్నాయికోడే యుగంధర్,చెరుకు శ్రీనివాస్, మాజీ శివాజీ యువజన మండలి అధ్యక్షులు కోరే మల్లేష్, మత్స్య శాఖ అధ్యక్షులు ఎద్దు వెంకన్న,కురుమ సంఘం అధ్యక్షులు మజ్జిగ లక్ష్మణ్,శాలివాహన సంఘం అధ్యక్షులు ఎలగందుల శ్రీనివాస్,రజక సంఘం అధ్యక్షులు ఎలిమినేటి మురళి,పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు ఏలగందుల మహేష్,వార్డు సభ్యులు బూడిద శేఖర్, ఎలగందు సైదులు,నాయకులు రంగ స్వామి,నోముల యాదగిరి,రంగ శ్రీను, యాస వెంకట్ రెడ్డి, రాచమల్ల దుర్గయ్య, ఎలగందుల శ్రీను, పరకాల రమేష్, ఉగ్గె నరేష్, యువజన మండలి సభ్యులు దిగోజు శ్రీనివాస చారి,కొంగరి పరుషరాములు,రంగ పరుష రాములు,తవిటి రాజు, తవిటి మచ్చగిరి, చిత్తర్ల అనిల్, బద్దుల వెంకన్న,కొంగరి విద్యాసాగర్, బత్తిని ప్రదీప్, గుండెగాని కిరణ్, మల్గ క్రాంతి, సూరారం శ్రీకాంత్, యాస సుభాష్, గడ్డం హరీష్, రాచమల్ల ప్రసాద్, తవిటి ఉదయ్, బద్దుల లక్ష్మణ్,గుండెగాని వినయ్, ఏనుగు అరుణ్, బండారు సాయి,దిగోజు భరత్, ఉగ్గె ప్రమోద్, వరికుప్పల మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
