యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 10 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా , కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఫిబ్రవరి 12 న దేశవ్యాప్త జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజ్ గౌడ్ పిలుపునిచ్చారు.ఆత్మకూరు మండల కేంద్రంలో రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం రైతాంగానికి దెబ్బతీసే విధంగా 2025 విత్తన సవరణ చట్టం తీసుకొచ్చిందని తద్వారా దేశంలోని ప్రత్యేకంగా తెలంగాణలోని విత్తన ఉత్పత్తి సంస్థలు మన దేశ రైతాంగానితోపాటు ప్రపంచంలోని 20 దేశాలకు విత్తనాలను ఉత్పత్తి చేసే స్థాయిలో అభివృద్ధి మన జరిగిందని విత్తన రంగంలో వందశాతం విదేశీ బహుళ జాతి పెట్టుబడులను ఆమోదించడం తో మన దేశీయ రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.అదేవిధంగా విద్యుత్తు సవరణ చట్టాన్ని తీసుకొచ్చి వ్యవసాయ రంగంలో కార్పొరేట్ వ్యక్తులకు అవకాశాలు కల్పించడం ద్వారా ప్రభుత్వం రైతులను స్మార్ట్ మీటర్లు పెట్టి విద్యుత్ బిల్లులని భాథాలని లేదా రైతాంగం మీద మోపే విధంగా విద్యుత్ సవరణ చట్టం తీసుకొచ్చిందని దీన్ని వ్యతిరేకంగా రైతాంగం తిరగబడాలని పిలుపునిచ్చారు. కార్మిక. కార్మిక చట్టాలని తుంగలో తొక్కి 29 కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోర్టులుగా మార్చి కార్మికుల హక్కులను కాలరాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి సత్యనారాయ రెడ్డి వృత్తి దారుల సంఘం మండల కన్వీనర్ వేముల బిక్షం నరేందర్ నరేష్ ఏపూరి బుగ్గ రాములు తదితరులు పాల్గొన్నారు.
