మంగళగిరి ఫిబ్రవరి 10 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తిరుపతి లడ్డు వివాదంపై మీడియా సమావేశం నిర్వహించిన గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డి ,ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ అప్పో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు ఈరోజు ఉదయం మంగళగిరి బైపాస్ రోడ్డు నందుగల నియోజవర్గ వైసిపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వేమారెడ్డి మాట్లాడుతూ.ప్రపంచ దేశాల్లోని హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. దేవుడితో కూడా రాజకీయాలు చేస్తున్నారు.సిట్, సిబిఐ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా తప్పుడు ప్రచారాలు చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం మీ ప్రభుత్వంలోనే అనుమతులు ఇచ్చి మీ ప్రభుత్వం లోనే ఆ కంపెనీలపై దర్యాప్తు చేయించారు. ఈ ప్రభుత్వాన్ని ఒకటే వేడుకుంటున్నాను ఎవరు రాజకీయాలు వాళ్ళు చేయండి అంతేగాని దేవుడుని అడ్డంపెట్టి రాజకీయాలు చేయొద్దు ప్రపంచంలోని హిందువులా మనోభావాలు గాయపరిచే విధంగా మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. రోజుకు ఓకథ కహాని చెప్పటం ఈ కూటమి ప్రభుత్వానికి అలవాటైపోయింది. మీ కూటమి ప్రభుత్వంపై ఎవరు మాట్లాడకూడదు మాట్లాడితే వాళ్లపై కేసులు పెట్టి జైల్లో పెడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు. విద్యార్థులకు ఫీజులు కట్టాలి ప్రభుత్వం అని అడిగితే వాటిని మర్చిపోవటానికి వేరొక స్టోరీ క్రియేట్ చేస్తారు. ఈ ప్రభుత్వం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఏది చెబుతున్నా ప్రజలు వింటున్నారని అనుకోవద్దు .ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేయవద్దు. మీరు మాట్లాడిన మాటలు అన్ని అసత్యాలు అని సిబిఐ, సిట్ నివేద కూడా ఇచ్చింది.తిరుమల లడ్డు ప్రసాదంలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది.హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడవద్దని సుప్రీంకోర్టు కూడా చెప్పింది.
ఈ కూటమి ప్రభుత్వం ఇంకా అలాగే మాట్లాడటం న్యాయమా .ప్రభుత్వం మీ చేతిలో ఉంది పూర్తి విచారం చేపించి మాట్లాడితే బాగుంటుంది. మా ప్రభుత్వ హయాంలో ఎవరికి కాంట్రాక్టు ఇవ్వలేదు.ఇక పైనుండి అయిన కూటమి ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలు ఆపి ప్రజల కోసం పనిచేయాలని కోరుతున్నాను.ఎమ్మెల్సీ హనుమంతరావు మాట్లాడుతూ.లడ్డు ప్రసాదంలో ఎటువంటి జంతువు కలవలేదని సిట్, సిబిఐ నివేదిక ఇచ్చారు .ఈ కూటమి ప్రభుత్వం కావాలని హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు.రాజకీయాలు కోసం దేవుడు అడ్డ పెట్టుకోవడం కరెక్ట్ కాదు .ప్రజలకి ఇవ్వాల్సిన పథకాలను తప్పుదారి పట్టించే విధంగా ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు .ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు త్వరలో బుద్ధి చెప్తాం అన్నారు.ఈ మీడియా సమావేశంలో తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రుముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి, మంగళగిరి రూరల్ అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
