Breaking News

శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవా ట్రస్ట్ సేవలు భేష్

మంగళగిరి ఫిబ్రవరి 10 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ఉండవల్లిలోని రాష్ట్ర ఐటి, విద్యాశాఖల మంత్రివర్యులు నారా లోకేష్ నివాసంలో మంగళవారం మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవా ట్రస్ట్ ప్రతినిధులు మంత్రి లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీ స్వామివారి గ్రామోత్సవం మిద్దె సెంటర్లోకి వచ్చినప్పుడు ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే భారీ ప్రసాదాల పంపిణీ కార్యక్రమానికి హాజరుకావాలని వారు ఆయన్ని కోరారు. ట్రస్టు ఈ ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా రూపొందించిన నూతన క్యాలెండర్ ను ఆయనకు అందజేశారు. సుమారు 20 సంవత్సరాల నుంచి ప్రసాదాలు పంపిణీ కొనసాగుతుందని ట్రస్ట్ సభ్యులు మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. ట్రస్టు సభ్యులు స్వామివారి క్యాలెండర్ ను అందంగా రూపొందించడంతోపాటు, భారీగా ప్రసాదాలు పంపిణీ చేయడం అభినందనీయమని మంత్రి లోకేష్ అన్నారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా మిద్దె సెంటర్లో ఏర్పాటు చేసే విద్యుత్ అలంకరణకు సహకరించాలని సభ్యులు కోరారు. మంత్రి లోకేష్ మిద్దె సెంటర్లో వేసే విద్యుత్ అలంకరణ ప్రతి ఏడాది తమ సొంత ఖర్చులతో వేయించడం జరుగుతుందని ట్రస్ట్ సభ్యులకు హామీ ఇచ్చారు. దీంతో సభ్యులు మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర మిషన్ డైరెక్టర్, ట్రస్టు సభ్యురాలు ఆరుద్ర భూలక్ష్మి, ట్రస్టు వ్యవస్థాపకులు పణిదపు శ్రీనివాసరావు, భక్త బృందం ప్రతినిధులు గాలి ప్రతాపరెడ్డి, జంజనం దినేష్, పణిదపు భాను ప్రసాద్, నందం వెంకట నరసింహారావు, అర్చక స్వామి దగ్గుపాటి సాంబశివరావు పాల్గొన్నారు.

పోక్సో కేసులో హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్

‘భోగి’లో డింపుల్ హయతి పవర్‌ఫుల్ లుక్ వైరల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *