బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

ప్రజల సహకారం తోనే నగర అభివృద్ధి

ప్రజల సహకారం తోనే నగర అభివృద్ధి

తెనాలి రోడ్డు విస్తరణకు సహకరించాలి.

ముస్లింల ఖబర్ స్థాన్ కు ఎటువంటి ఇబ్బంది లేదు.

ఏ ఒక్క సమాధిని తొలగించం.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

నగరపాలక సంస్థ కమిషనర్ అలీమ్ బాషా

మంగళగిరి ఫిబ్రవరి 14 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ప్రజల సహకారంతోనే నగర అభివృద్ధి సాధ్య పడుతుందని, నగరంలోని తెనాలి రోడ్డు విస్తరణ కు స్థానిక ప్రజలు కుల, మతాలకు అతీతంగా సహకరించాలని కమిషనర్ అలీమ్ బాషా కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ నగరంలో నానాటికి పెరిగిపోతున్న ట్రాఫిక్ తో ఎంతో మంది ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు తెనాలి రోడ్డు విస్తరణ చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.తెనాలి రోడ్డు విస్తరణకు కబరస్తాన్ ను ఏమాత్రం కదిలించకుండా ఫ్లైఓవర్ నిర్మించి రహదారిని విస్తరించే విధానాన్ని మ్యాప్ ద్వారా మీడియాకు చూపుతున్న కమిషనర్ అలీమ్ భాష 160 అడుగుల రోడ్డు గా విస్తరించనున్నామని, ఇందుకు గానూ ఇప్పటికే ఉన్న రహదారికి ఇరువైపులా కేవలం 16-17 అడుగుల మేర విస్తరించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో అదే మార్గంలో ఉన్న ముస్లిం ఖబర్ స్థాన్ (స్మశాన వాటిక) లోని ఖబర్ (సమాధులు) కు వచ్చే ఇబ్బంది ఎంతమాత్రం ఉండదన్నారు. రోడ్డు మధ్యలో 6-8 అడుగుల మేర ఫిల్లర్లు వేసి క్యాంటీ లివర్ (ఫ్లై ఓవర్) రహదారి విస్తరణ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని కమిషనర్ అలీమ్ బాషా స్పష్టం చేశారు. కావున తెనాలి రోడ్డు విస్తరణ కు స్థానిక ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.