Breaking News

హాస్టల్ విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టండి: జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

  • రికార్డులు పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
  • కేజీబీవీలో మెస్ ను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
  • కేజీబీవీ పాఠశాల వసతి గృహాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నాం
  • కేజీబీవీ వసతి గృహ ప్రత్యేక అధికారిణిని ప్రభుత్వానికి సరెండర్ చేశాం
  • విద్య ఆరోగ్యం సంక్షేమం పట్ల అలసత్వం వహిస్తే వేటు తప్పదు

ఎ.కొండూరు ఫిబ్రవరి 14 (నేటి తెలుగు పత్రిక): విద్యార్థుల విద్య, అరోగ్యం,సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరి అధికారుల అలసత్వం, నిర్వహణలోపం కారణంగా దురదృష్టకర సంఘటనలు ఎదురవుతున్నాయని ఇటీవల ఎ.కొండూరు కేజీబీవీ పాఠశాల డార్మెంటరీలలో ఎలుకల దాడి సంఘటనపై పూర్తి విచారణ జరిపి సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటున్నామని భవిష్యత్ లో ఇటివంటి సమస్యలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.ఎ.కొండూరు మండలంలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని శనివారం జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ తనిఖీ చేసి విద్యార్థులు,సిబ్బంది నుండి సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేజీబీవీ పాఠశాల డార్మెంటరీలో 12 మంది విద్యార్థులు ఎలుకల దాడికి గురి కావడం బాధాకరమన్నారు. సంఘటన జరిగిన వెంటనే స్పందించడం జరిగిందని ఇందుకు గల కారణాలపై పూర్తి విచారణ చేయడం జరిగిందన్నారు.ఎలుకల వలన గాయపడిన విద్యార్థులకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించడం జరిగిందన్నారు. పాఠశాల డార్మెటరీ వెనక బావి ఎలుకలకు నివాసంగా మారిందని రాత్రి సమయాలలో ఎలుకలు డార్మెటరీలో ప్రవేశించి విద్యార్థుల పై దాడి చేయడం జరిగిందని,ఈ పరిస్థితిని నివారించడంలో గ‌త జ‌న‌వ‌రి 31 వ‌ర‌కు ప్ర‌త్యేక అధికారిణిగా ప‌నిచేసిన ఎం.శ్యామ‌ల అలసత్వాన్ని గుర్తించి ఆమెను విధుల నుంచి త‌ప్పించి, ప్ర‌భుత్వానికి స‌రెండ‌ర్ చేసిన‌ట్లు తెలిపారు.
ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పూడికపడిన డ్రైనేజి వ్యవస్థను సరిచేసేందుకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు.ఎలుక బోన్లులను ఏర్పాటు చేశామని ఎలుకలు లోపలకు ప్రవేశించకుండా మెస్ ఏర్పాటు చేయడంతో పాటు గోడను నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయ పర్యవేక్షణ బాధ్యతలను స్థానిక ఎంపిడివో బొజ్జ గాని శ్రీనివాసరావుకు అప్పగించడం జరిగిందన్నారు. విద్యార్థుల విద్య, ఆరోగ్య,సంక్షేమం పట్ల అలసత్వం వహించే అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని జిల్లా కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా సంక్షేమ అధికారులు వసతి గృహ విద్యార్థుల ఆరోగ్యం పట్ల మరింత బాధ్యతతో వ్యవహరించాలన్నారు. హాస్టల్ సంక్షేమ అధికారి విద్యార్థుల భవిష్యత్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలన్నారు. ముఖ్యంగా ఆరోగ్యం, క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్చిన అవసరం ఉందన్నారు. విద్యార్థులను ఎప్పటికప్పుడు చైతన్యవంతులను చేసి పట్టుదలతో మంచి విద్యను అభ్యసించేందుకు కృషి చేయాలన్నారు.హాస్టల్ నిర్వహణలో లోపాలను గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ద పెట్టాలని, కాచి చలార్చిన నీటిని వినియోగించాలన్నారు. హాస్టల్స్ కు సరఫరా చేసే మినరల్ వాటర్ ప్లాంట్లను వాటర్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు.వసతి గృహ నిర్వహణలో పచ్చదనం,పరిశుభ్రత, పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి నిర్వహించినప్పుడు విద్యార్థులలో మానసిక ఉల్లాసం పెరిగి ఆరోగ్యంతో పాటు మెరుగైన విద్యను అభ్యశించేందుకు ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ప్ర‌స్తుతం కేజీబీవీ ప్రిన్సిపాల్ విజ‌య‌సుంద‌రిని అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించిన‌ట్లు వెల్ల‌డించారు.
పాఠశాల తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట ఎ. కొండూరు తహశీల్దార్ ఎన్.అరవింద్, ఎంఇవో2 ఈ ఎల్ సి కేశవరావు, కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయ ప్రిన్సిపాల్ ఎన్.విజయసుందరి, రాష్ట్ర మాదిగ కార్పో రేషన్ ఫైనాన్స్ డైరెక్టర్ వాసం మునియ్య, రాష్ట్ర గిరిజన సంఘం నాయకులు బి. గోపిరాజు సిబ్బంది ఉన్నారు.

గీతవృత్తిలో ప్రమాదాలకు గురై గీత కార్మికులకు రావలసిన ఎక్స్ గ్రేషియాలకు నిధులు విడుదల చేయాలి.

క్రీడా పోటీలు మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవి శ్వాసాన్ని పెంపొందిస్తాయి: మంత్రి మండిపల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *