కోదాడ, ఫిబ్రవరి 14 నేటి తెలుగు పత్రిక: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎర్ర జెండా ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. మండలం జగన్నాధపురం గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల స్మారక సభ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అద్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి హాజరై మాట్లాడారు. మాట్లాడుతూ.. నాడు సాగిన తెలంగాణ రైతంగ సాయుధ పోరాటంలో కేసబోయిన ముత్తయ్య కీలక భూమిక పోషించారన్నారు. ఎర్రజెండా నాయకత్వంలో భూస్వాముల చెర నుంచి పది లక్షల ఎకరాల భూమిని విడిపించారని చెప్పారు.ఈ ప్రాంతంలో ఇండ్ల స్థలాలు, సాగు భూములు పంచి పెట్టిన గొప్ప వ్యక్తులు అని పేర్కొన్నారు.అనంతరం అమరవీరుల స్మారక వద్ద ఎర్ర జెండా ఆవిష్కరించారు.ప్రజా నాట్య మండలి కళాకారులచే స్మృతి గీతాలు ఆలపించారు.
అన్నారు, తెలంగాణ రైతన్న సాయుధ పోరాటంలో మునగాల మండలానికి గొప్ప చరిత్ర ఉందని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో అనేక మంది అసువులు బాసారని, భూమికోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కోసం వెట్టి చాకిరి కి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో జగన్నాధపురం గ్రామం నుండి అనేకమంది పాత్ర పోషించారని ఆయన అన్నారు. ప్రజలు ఓటు వేసి అధికారం ఇచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఉచిత విద్యతోపాటు, ఉచిత వైద్యాన్ని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి నేటికీ కూడా మహిళలకు ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తుందని ఆయన అన్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం బడా బాబులకు అండగా ఉంటుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనపై సిపిఎం పార్టీ నిరంతరం పోరాడుతుందని ఆయన అన్నారు. కేరళ రాష్ట్రంలో ఉన్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉచిత విద్యను అమలు చేయాలన్నారు. కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రతి ఒక్కటి తెలంగాణ ప్రభుత్వం అనుసరించాలని ఆయన తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉండాలన్న, అలాంటి సమాజం కోసం పోరాడేది సిపిఎం పార్టీ ఎర్రజెండా మాత్రమే అని ఆయన అన్నారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటిసి ఎన్నికల్లో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సిపిఎం పార్టీ కార్యకర్తలు సైనికుల పనిచేయాలన్నారు. గ్రామాలలో ఉండే ప్రజలు కార్యకర్తలు తెగబడి పని చేయాలన్నారు. ఎర్రజెండా పక్షాన నిలబడడం కోసం ప్రయత్నం చేయాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలోడి వైఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ములకపల్లి రాములు, సర్పంచ్ బొల్లం యమున లింగరాజు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చలికూర స్వరాజ్యం, షేక్ సైదా, జూలకంటి విజయలక్ష్మి, సీనియర్ నాయకులు ఎం వెంకటేశ్వరావు, మండల కమిటీ సభ్యులు చందా చంద్రయ్య, కొండారెడ్డి,సుందరయ్య,గోపయ్య , స్టాలిన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, శాఖ కార్యదర్శి లు బుత్తం వెంకన్న,దైద సైదులు, ఎస్కే ఖాజాబి ఖాదర్ సైదులు,కలకొవ సర్పంచ్ వెంకటాద్రి, నర్సింహులగూడెం సర్పంచ్ కుంచం ఇందిరా నర్సయ్య, వివిధ గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్ లు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

