Breaking News

యాదాద్రి జిల్లాలో ఆరు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ విజయం: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఎన్నికల్లో ఆరు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ విజయ బావుటా ఎగరవేసిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం పట్టణ అధ్యక్షుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరింత చేరువైందని అన్నారు. జిల్లాలోని అన్ని చైర్మన్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఇందుకు నిదర్శనం అన్నారు. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాబోయే జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇది పునరావృతం అవుతుందన్నారు. సామాజిక పొందుకలో కొందరికి సీట్లు రాణి వారు అధైర్య పడాల్సిన పని లేదు అన్నారు. మార్కెట్ కమిటీ పి.ఏ.సి.ఎస్ కార్పొరేషన్లలో నామినేట్ పోస్టులలో వారికి అవకాశం ఉంటుందని అన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ బిజెపికి లోపాయి కారీగా సహకరించడం వల్లే యాదగిరిగుట్టలో ఆ రెండు సీట్లు బిజెపికి వచ్చాయి. కేవలం ఒకే ఒక సీటు బిఆర్ఎస్ పరిమితమైందని అన్నారు. ఆలేరులో 50 నిమిషాలు ఓట్లు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తే టిఆర్ఎస్ కు చేయవలసిన 34% ఓట్లే వచ్చాయని 20% ఓట్లతో కాంగ్రెస్ చాలా ముందున్న విషయం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల వల్ల ప్రజాప్రతిని ప్రజాపాలన ద్వారా ప్రజల మందనలు పొందుతున్నారని అన్నారు. ఆలేరులో కాంగ్రెస్ పార్టీని ఓడి చేతికి మాజీ ఎమ్మెల్యేలు సునీత మహేందర్ రెడ్డి, బిక్షమయ్య గౌడ్, కల్లూరు రామచంద్రారెడ్డి, ఎన్నికలలో ప్రజలు మూడు సీట్లకు పరిమితం చేశారని అన్నారు. గొంగిడి మహేందర్రెడ్డి టిఆర్ఎస్ ప్రజలు అధికారులు కదా రెండు మునిసిపాలిటీలను కేవలం నాలుగు కారణాలకు నీ పార్టీని పరిమితం చేశావు ఎందుకు అని ప్రశ్నించారు. రెండు మునిసిపాలిటీలను 24 స్థానాలు 67% కౌన్సిలర్లుగా కాంగ్రెస్ వైపు నుండి గెలిస్తే బిజెపి టిఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకొని కూడా 33 శాతం కౌన్సిలర్లుగా పరిమితం అయ్యారని టిఆర్ఎస్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిందని అన్నారు.యాదగిరిగుట్ట ఆలేరులో ఓటేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సమిష్టి వల్ల ఈ విజయం Conversation వీరితో పాటు కార్పొరేషన్ చైర్ పర్సన్ బండి శివబారాణి, ఉపేందర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి, ఎండి బాబా, సర్పంచులు ఉప సర్పంచ్లు పాల్గొన్నారు.

గీతవృత్తిలో ప్రమాదాలకు గురై గీత కార్మికులకు రావలసిన ఎక్స్ గ్రేషియాలకు నిధులు విడుదల చేయాలి.

క్రీడా పోటీలు మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవి శ్వాసాన్ని పెంపొందిస్తాయి: మంత్రి మండిపల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *