బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

ఉన్నత విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు.

ఉన్నత విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు.

కరీంనగర్,నేటి తెలుగు పత్రిక: ఉన్నత విద్యలో రాణించే విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ లోని సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహం బాలికలతో మాట్లాడారు. విద్యార్థినీ,విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉన్నత విద్య వారధి వంటిదని,విద్యార్థులకు కీలమైన పదో వార్షిక పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఇందుకు విద్యార్థులు చదువుపై దృష్టి సారించి పరీక్షల్లో రాణించాలన్నారు. వార్షిక పరీక్షకు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, అత్యంత కీలకంగా మారిన ఈ కొద్ది రోజులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు అవగాహనతో ప్రణాళికాబద్దంగా చదవాల్సిన అవసరం ఉందన్నారు. మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు తీసుకోవాలని ఆయన సూచించారు. గణితంలో ఎక్కువ మార్కులు సాధించేందుకు అవకాశాలు ఎక్కువన్నారు. అయితే చాలా మంది విద్యార్థులు గణి తశాస్త్రమంటేనే బెంబేలెత్తిపోతుంటారని, విద్యార్థులు భయాన్ని వీడి గణితంపై శ్రద్ధ పెట్టాలన్నారు. సూత్రాలతో సాధన చేస్తే గణితంలో ఉత్తీర్ణత సాధించడం కష్టమేమీ కాదని డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ఇప్పటికైనా విద్యార్థులు పదవ తరగతి పరీక్షల కోసం కష్టపడి చదివాలని ఆయన కోరారు. పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధిస్తే నగదు రివార్డుతోపాటు బట్టలు అందజేస్తానని హామీ ఇచ్చారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు