బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే?

భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే?

నేటి తెలుగు పత్రిక: నాన్‌వెజ్ ప్రియులకు పెద్ద ఊరట లభించింది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. గత నెలలో కిలో రూ.350 వరకు చేరిన ధర ఇప్పుడు దాదాపు రూ.150 మేర తగ్గింది. పండుగ సీజన్ ముగియడం, కొన్ని ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ ప్రభావం కారణంగా డిమాండ్ తగ్గడంతో ఈ తగ్గుదల కనిపిస్తోంది.

హైదరాబాద్‌లో ప్రస్తుతం ధరలు

  • కేజీ డ్రెస్స్డ్ చికెన్ – రూ.206
  • కేజీ స్కిన్‌లెస్ చికెన్ – రూ.234
  • ఫామ్ రేటు (లైవ్ బర్డ్) – రూ.115
  • రిటైల్ లైవ్ బర్డ్ – రూ.142

గత నెలలో సంక్రాంతి, మేడారం జాతరల సమయంలో భారీ డిమాండ్ ఉండటంతో ధరలు పెరిగాయి. ఇప్పుడు డిమాండ్ తగ్గడంతో మార్కెట్ స్థిరపడింది.

ఏపీలో ధరలు ఇలా..

ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపు ఇదే రేట్లు కొనసాగుతున్నాయి:

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు
  • డ్రెస్స్డ్ చికెన్ – రూ.206
  • స్కిన్‌లెస్ చికెన్ – రూ.234
  • ఫామ్ వద్ద లైవ్ బర్డ్ – రూ.115
  • రిటైల్ లైవ్ బర్డ్ – రూ.142

కొన్ని జిల్లాల్లో మాత్రం ధరలు ఇంకా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ప్రభావంతో కిలో రూ.160 నుంచి రూ.180 వరకూ విక్రయిస్తున్నారు.

గుడ్ల ధరలు కూడా తగ్గాయి

గత నెలలో ఒక్కో గుడ్డు రూ.10 వరకు ఉండగా, ఇప్పుడు రూ.5కు పడిపోయింది. 12 గుడ్ల ట్రే ధర ప్రస్తుతం రూ.75గా ఉంది.

అధికారులు ఏమంటున్నారు?

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కొంతమంది చికెన్ కొనుగోలుకు వెనుకాడుతున్నా, సరైన విధంగా 100 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పైగా ఉడికించి తింటే ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు సూచిస్తున్నారు.మొత్తానికి, ధరలు భారీగా తగ్గడంతో నాన్‌వెజ్ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.