బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

తెలంగాణకు మరో జాతీయ రహదారి..

తెలంగాణకు మరో జాతీయ రహదారి..

మహబూబ్‌నగర్–గుడబెళ్లూరు నాలుగు లైన్లు

నేటి తెలుగు పత్రిక: తెలంగాణకు కేంద్రం నుంచి మరో కీలక ఆమోదం లభించింది. రాష్ట్రంలో కొత్త నేషనల్ హైవే నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహబూబ్‌నగర్ నుంచి కర్ణాటక సరిహద్దులోని గుడబెళ్లూరు వరకు నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ ప్రాజెక్టుకు అనుమతి లభించింది. తొలి విడతగా సుమారు రూ.3,000 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం ఇచ్చినట్లు సమాచారం.

ఏ ప్రాంతాల మీదుగా?

ఈ కొత్త హైవే మార్గం:

  • మహబూబ్‌నగర్
  • దేవరకద్ర
  • మరకిల్
  • మఖ్తల్
  • మాగనూరు
  • రాయచూర్ సరిహద్దు (కర్ణాటక)

మొత్తం 80.01 కిలోమీటర్ల దూరంలో హ్యామ్ (Hybrid Annuity Model) విధానంలో నిర్మించనున్నారు. పలు పట్టణాల వద్ద ప్రత్యేక బైపాస్‌లను కూడా నిర్మించనున్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

హైదరాబాద్–గోవా ప్రయాణం సులభం

ఈ రహదారి హైదరాబాద్–గోవా ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా ఉంటుంది. దీంతో హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లే ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది. ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్లుగా మార్చడంతో ట్రాఫిక్ రద్దీ తగ్గి, దాదాపు 2 గంటల వరకు ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది.

శ్రీశైలం భక్తులకు ప్రయోజనం

ఇదే సమయంలో మన్ననూరు–శ్రీశైలం దేవస్థానం ఎలివేటెడ్ కారిడార్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో శ్రీశైలం వెళ్లే భక్తులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కలగనుంది.

భూసేకరణ, పరిహారం

ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తి దశలో ఉన్నట్లు సమాచారం. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టారు. త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభమై, నిర్మాణ పనులు వేగం పుంజుకోనున్నాయి.ఈ ప్రాజెక్టుతో మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో పరిశ్రమల అభివృద్ధికి కూడా ఊతం లభించనుంది.