బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

తిరువూరు పట్టణంలో 22వ రోజు డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం.

తిరువూరు పట్టణంలో 22వ రోజు డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం.

తిరువూరు ఫిబ్రవరి 17 (నేటి తెలుగు పత్రిక): తిరువూరు పట్టణంలో 22వ రోజు డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమాన్ని మహిళా పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన సైకిల్ యాత్ర. సైకిల్ ర్యాలీలో పాల్గొన్న వారికి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బొట్టుపెట్టి హారతి పట్టి స్వాగతం పలికిన మహిళలు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీసులు. డ్రగ్స్ పై దండయాత్ర సైకిల్ ర్యాలీలో పాల్గొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె. గిరిబాబు ఎస్ఐలు శాతకర్ణి. రాజు విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు విద్యార్థులను ఉద్దేశించి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె. గిరిబాబు మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. విద్యార్థులు మంచి నడవడికతో అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. చదువుపై దృష్టి పెట్టి పాఠశాలకు. కళాశాలలకు తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే డ్రగ్స్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ వల్ల మీ మెదడు పనితీరు తగ్గిపోతుందని చదువు మీద ఆసక్తి పోతుందని ఆరోగ్యం చెడిపోతుందన్నారు. డ్రగ్స్ వాడటం మాత్రమే కాదు వాటిని అమ్మటం కూడా చట్టపరంగా నేరమన్నారు. చిన్న వయస్సులోనే కేసులు పెడితే మీ కెరియర్ దెబ్బతిని ఉద్యోగ అవకాశాలు కోల్పోతారన్నారు. ఎప్పుడైనా ఒత్తిడి భయం సమస్యలు ఉంటే డ్రగ్స్ వైపు చూడకుండా ఉపాధ్యాయులతో మాట్లాడి మనోధైర్యం పొందాలని సూచించారు. డ్రగ్స్ కు ఒక అడుగు దగ్గరైతే జీవితానికి పది అడుగుల దూరం అవుతారన్నారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ పై దండయాత్ర కేవలం కార్యక్రమం కాదని భవిష్యత్తు కోసం జరుగుతున్న యుద్ధం అన్నారు. ఇది యాత్ర కాదని యువత భవిష్యత్తును కాపాడే సంకల్పం అన్నారు. డ్రగ్స్ పై ఎలాంటి సమాచారమైన 112 కు కానీ 1972 కు కానీ తెలియజేయాలన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థినీలు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు