బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

బాల్య వివాహాల నిర్మూలన పై అవగాహన సదస్సు

బాల్య వివాహాల నిర్మూలన పై అవగాహన సదస్సు

పామర్రు, మార్చి 04(నేటి తెలుగు పత్రిక): బాల్య వివాహ రహిత సమాజ స్థాపన లో ప్రతి ఒక్కరూ భాగస్వాములుకావాలి ని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎస్.విజయ కుమారి అన్నారు. మండల పరిధిలోని పెదమద్దాలి గ్రామంలో శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో బాల్య వివాహ నిర్మూలన కొరకు అవగాహన కార్యక్రమం జరిగింది. బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని బాల్య వివాహాలు నిర్మూలన ద్వారా ఆడపిల్లల భవిష్యత్తు ఉన్నత చదువుల వైపు కొనసాగి భవిష్యత్తు బంగారు మయంగా తయారవుతాయి అన్నారు. స్థానిక అంగన్వాడీ టీచర్ కే అరుణ ప్రసంగిస్తూ, బడి ఈడు పిల్లలంతా బడిలోనే ఉండాలని అప్పుడే బాలల హక్కులు పరిరక్షింపబడతాయి అన్నారు. కళాజాత బృందముఖ్య ఆర్గనైజర్ వై. వీరయ్య ప్రసంగిస్తూ గర్భస్థ శిశువు నుండి బాలల హక్కులు పరిరక్షింపబడడానికి ప్రభుత్వం ఎన్నో రకాలుగా చర్యలు తీసుకుంటుందని వారి బృంద సభ్యులు ప్రదర్శనలతో ప్రజలకు ప్రయోగాత్మకంగా వివరించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాల్య వివాహాల నిర్మూలన పై కళాజాత బృందం ఆలపించిన గేయాలు పలువురిని ఆకర్షించాయి.కార్యక్రమంలో కళాజాత బృంద సభ్యులు వై రవితేజ, తదితరులు పాల్గొన్నారు. తోలుతపెదమద్దాలి సెక్టార్ పరిధిలోని మహిళలచేత బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు