బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
స్పోర్ట్స్

టీ20 వరల్డ్‌కప్ విజేతలకు బీసీసీఐ కాసుల వర్షం

టీ20 వరల్డ్‌కప్ విజేతలకు బీసీసీఐ కాసుల వర్షం

నేటి తెలుగు పత్రిక, Mar 10: భారత క్రికెట్ నియంత్రణ మండలి టీమ్ ఇండియా ఘన విజయాన్ని పురస్కరించుకుని భారీ నగదు బహుమతిని ప్రకటించింది. భారత జాతీయ క్రికెట్ జట్టు ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2026లో విజయం సాధించిన నేపథ్యంలో మొత్తం రూ.131 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించింది.భారత క్రికెట్ చరిత్రలో 2024, 2026 టీ20 ప్రపంచకప్ విజయాలు అద్భుతమైన క్యాచ్‌లతో గుర్తుండిపోయాయి. 2024లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుత క్యాచ్ భారత్‌కు విజయం అందించగా, 2026లో ఇషాన్ కిషన్ మెరుపు క్యాచ్‌తో మరోసారి ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది.

2024లో కెన్సింగ్టన్ ఓవల్ లో జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలిచింది. ఆ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా క్యాచ్ పట్టడం మ్యాచ్‌ను మలుపుతిప్పింది. ఆ విజయానికి గుర్తుగా అప్పట్లో బీసీసీఐ రూ.125 కోట్ల బహుమతి ప్రకటించింది.

కప్‌పై సందేహం నుంచి చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

అయితే 2026లో నరేంద్ర మోదీ స్టేడియం లో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్ జాతీయ క్రికెట్ జట్టు పై భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ పట్టిన అద్భుత క్యాచ్ కీలకంగా మారింది.ఈ విజయంతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో టీమ్ ఇండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్‌కప్ గెలిచి, మొత్తం మూడుసార్లు ఈ టైటిల్‌ను సొంతం చేసుకున్న తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనను గౌరవిస్తూ బీసీసీఐ రూ.131 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించింది.