బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
స్పోర్ట్స్

భారత క్రికెట్ లెజెండ్స్‌కు అరుదైన గౌరవం.. బీసీసీఐ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు

భారత క్రికెట్ లెజెండ్స్‌కు అరుదైన గౌరవం.. బీసీసీఐ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): భారత క్రికెట్‌కు విశేష సేవలు అందించిన ముగ్గురు దిగ్గజాలకు అరుదైన గౌరవం దక్కింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2024–25 సీజన్‌కు గాను ప్రతిష్టాత్మక లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులను భారత క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, రోజర్ బిన్నీ మరియు మహిళా క్రికెట్ లెజెండ్ మిథాలీ రాజ్ లకు అందజేయనుంది. మార్చి 15న న్యూఢిల్లీ లో జరిగే నమన్ (NAMAN) అవార్డుల వేడుకలో ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. పురుషుల విభాగంలో రాహుల్ ద్రవిడ్, రోజర్ బిన్నీలకు ప్రతిష్టాత్మకమైన ‘కల్నల్ సి.కె. నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ ఇవ్వనుండగా, మహిళల విభాగంలో మిథాలీ రాజ్ కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ ఫర్ ఉమెన్ అవార్డు అందించనున్నారు. ఈ గౌరవంతో పాటు ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు బహుమతి కూడా ఇవ్వనున్నారు.రోజర్ బిన్నీ పేరు వినగానే 1983లో భారత్ గెలిచిన చారిత్రాత్మక ప్రపంచకప్ గుర్తుకొస్తుంది. ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం కోచ్‌గా, సెలక్టర్‌గా కూడా సేవలందించారు. 2022 నుంచి 2025 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసి భారత క్రికెట్ అభివృద్ధికి కృషి చేశారు.

ఇక రాహుల్ ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్‌లో 24 వేలకుపైగా పరుగులు సాధించి భారత జట్టుకు దశాబ్ద కాలం పాటు వెన్నెముకలా నిలిచారు. ఆటగాడిగానే కాకుండా కోచ్‌గా కూడా అద్భుత విజయాలు సాధించారు. ఆయన మార్గదర్శకత్వంలో భారత్ 2018 అండర్-19 ప్రపంచకప్ గెలిచింది. అలాగే 2024 టీ20 ప్రపంచకప్ విజయంలో కూడా కీలక పాత్ర పోషించారు.మహిళా క్రికెట్‌లో అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకరైన మిథాలీ రాజ్ రెండు దశాబ్దాల పాటు భారత జట్టుకు సేవలందించారు. వన్డేల్లో 7805 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. భారత మహిళా జట్టును రెండు సార్లు ప్రపంచకప్ ఫైనల్‌కు చేర్చిన ఘనత కూడా ఆమెదే. మహిళా క్రికెట్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభిస్తోంది.ఈ నమన్ అవార్డుల వేడుకలో గత సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన యువ ఆటగాళ్లకు కూడా ప్రత్యేక అవార్డులు అందజేయనున్నారు.

కప్‌పై సందేహం నుంచి చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్