బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
స్పోర్ట్స్

క్రికెట్ పండుగకు రంగం సిద్ధం.. రేపు ఢిల్లీలో బీసీసీఐ నమన్ అవార్డ్స్ వేడుక

క్రికెట్ పండుగకు రంగం సిద్ధం.. రేపు ఢిల్లీలో బీసీసీఐ నమన్ అవార్డ్స్ వేడుక

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): భారత క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించే నమన్ (NAMAN) అవార్డ్స్ 2026 వేడుకలు మార్చి 15న న్యూఢిల్లీ లో అట్టహాసంగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో గత ఏడాది అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లు, కోచ్‌లు, అంపైర్లను సత్కరించనున్నారు. ఇప్పటికే విజేతల జాబితా ఖరారు కావడంతో క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది.ఈసారి పురుషుల విభాగంలో టీమిండియా స్టార్ బ్యాటర్ శుభమాన్ గిల్ కు అత్యున్నతమైన పాలీ ఉమ్రీగర్ అవార్డు దక్కనుంది. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా గిల్ ఈ అవార్డును వరుసగా రెండోసారి అందుకోబోతున్నారు. మహిళల విభాగంలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డును గెలుచుకుంది. ఆమె కెరీర్‌లో ఈ గౌరవం దక్కడం ఇది ఐదోసారి కావడం విశేషం.

దేశవాళీ క్రికెట్‌లో రాణించిన వారికి కూడా బీసీసీఐ పెద్దపీట వేసింది. ముంబైకి చెందిన ఈరా జాదవ్ ఉత్తమ మహిళా క్రికెటర్‌గా జగ్మోహన్ దాల్మియా ట్రోఫీని అందుకోనుండగా, హర్యానాకు చెందిన స్టార్ ఆటగాళి షఫాలీ వర్మ సీనియర్ వన్డేల్లో అద్భుత ప్రదర్శనకు గాను ఇదే ట్రోఫీని సొంతం చేసుకుంది.అలాగే ముంబై యువ ఆటగాడు ఆయుష్ మాత్రే, విదర్భకు చెందిన హర్ష దూబే లు లాలా అమర్‌నాథ్ అవార్డులను గెలుచుకున్నారు. ఇక దేశవాళీ క్రికెట్‌లో నాలుగు ట్రోఫీలు గెలిచి అగ్రస్థానంలో నిలిచిన ముంబై క్రికెట్ అసోసియేషన్ కు బెస్ట్ పెర్ఫార్మింగ్ అసోసియేషన్ అవార్డు దక్కనుంది.ఈ వేడుకల్లో గతంలో ఐసీసీ ట్రోఫీలు గెలిచిన భారత జట్లను కూడా ప్రత్యేకంగా సత్కరించనున్నారు. దీంతో ఈసారి నమన్ అవార్డ్స్ వేడుక క్రికెట్ అభిమానులకు నిజమైన పండుగలా మారనుంది.

కప్‌పై సందేహం నుంచి చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్