బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

రంజాన్ ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి.. ఐక్యతకు పిలుపు

రంజాన్ ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి.. ఐక్యతకు పిలుపు

మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అన్ని మతాలకు చెందిన ప్రజలు సోదరభావంతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు నడిపించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం సాధ్యమైనంత సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. రంజాన్ మాసం కేవలం పండుగ మాత్రమే కాకుండా విలువలను గుర్తుచేసే పవిత్రమైన సమయం అని ఆయన పేర్కొన్నారు. నెల రోజులపాటు ఆత్మశుద్ధితో పరులకు సహాయం చేస్తూ, అందరితో సత్సంబంధాలు కొనసాగించడమే రంజాన్ మాసం సందేశమని తెలిపారు.ఈ ఇఫ్తార్ విందులో మంత్రి మహ్మద్ అజారుద్దీన్, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ముస్లిం మతపెద్దలు మరియు మైనారిటీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు