బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
స్పోర్ట్స్

SRH vs RCB కాదు.. IND vs PAK ఫీల్.. వీరేందర్ సెహ్వాగ్ సంచలన కామెంట్స్

SRH vs RCB కాదు.. IND vs PAK ఫీల్.. వీరేందర్ సెహ్వాగ్ సంచలన కామెంట్స్

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే పెద్ద వివాదం తెరపైకి వచ్చింది. మార్చి 28న జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌పై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.ఈ మ్యాచ్‌ను సాధారణ ఐపీఎల్ గేమ్‌గా చూడొద్దని, ఇది భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లా భావించాలని సెహ్వాగ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.

వివాదానికి కారణం ఏమిటి?

ఈ హీట్‌కు కారణం కావ్య మారన్ తీసుకున్న నిర్ణయం. ‘ది 100’ లీగ్ వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేయడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. భారత ఫ్యాన్స్‌లో కొందరు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఫ్యాన్స్ వార్‌కు రంగం సిద్ధం

సెహ్వాగ్ మాట్లాడుతూ, ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులే ఎక్కువగా కనిపిస్తారని, స్టేడియం మొత్తం ఆర్‌సీబీ రంగులతో నిండిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కప్‌పై సందేహం నుంచి చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

మ్యాచ్‌పై పెరిగిన హైప్

ఇప్పటికే IPL మ్యాచ్‌లకు భారీ క్రేజ్ ఉండగా, ఈ వివాదం కారణంగా SRH vs RCB మ్యాచ్‌పై మరింత ఉత్కంఠ నెలకొంది. కేవలం ఆట పరంగానే కాకుండా భావోద్వేగ పరంగానూ ఈ పోరు ప్రత్యేకతను సంతరించుకుంది.