ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: పామర్రు ఏప్రిల్ 10:ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించేందుకు జనగణన సర్వే ఎంతో కీలకమని పామర్రు ఎంపీడీవో కాండ్రు జ్యోతి అన్నారు.స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జరుగుతున్నరెండు రోజు జనగణన శిక్షణ తరగతులకు గురువారo ముఖ్య అతిధిగా హాజరైన ఆమె మాట్లాడుతూ,మొదటి దశలో గృహాల లెక్కింపు, రెండో దశలో జనాభాగణననుపక్కాగా నిర్వహించాలనిసూచించారు. సర్వేలో క్షేత్రస్థాయి సిబ్బందితప్పులు లేకుండా డేటా సేకరించాలని ఆయన ఆదేశించారు.జనగణన రెండుదశల్లో జరుగుతుందిన్నారు.మొదటి దశలో గృహాల లెక్కింపు, రెండవ దశలో జనాభాగణన నిర్వహించవలసి ఉంటుందన్నారు. ఫీల్డ్ ట్రైనర్లు మరియు సిబ్బందికి జనగణన విధులలో శిక్షణ మూడు రోజులు కొనసాగుతుందన్నారు. 2011 తర్వాత జరుగుతున్నఈ ప్రక్రియలో డేటాఖచ్చితత్వం ముఖ్యమని జ్యోతి స్పష్టంచేశారు.ప్రభుత్వ పథకాల అమలుకు జనగణన ఎంతోకీలకమని పవర్ ప్రజెంటేషన్ద్వారావివరించారు. కార్యక్రమంలోసూపర్వైజర్లుడిప్యూటీ ఎంపీడీవోబొమ్మసాని సుబ్బారావు డిప్యూటీతాసిల్దార్ గోపాల్, మాస్టర్ ట్రైనీలు ధనరాజ్,కోటేశ్వరమ్మ,రవి పాల్గొన్నరు.
