బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

కర్ణాటక మంత్రి డి. సుధాకర్ కన్నుమూత.. రాజకీయ వర్గాల్లో విషాదం

కర్ణాటక మంత్రి డి. సుధాకర్ కన్నుమూత.. రాజకీయ వర్గాల్లో విషాదం

మే 10, (నేటి తెలుగు పత్రిక): కర్ణాటక రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రణాళిక, గణాంకాల శాఖ మంత్రి డి. సుధాకర్ (66) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా బెంగళూరులోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.ఇటీవల మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న సుధాకర్‌కు అనంతరం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను కిమ్స్ ఆస్పత్రికి తరలించి ప్రత్యేక చికిత్స అందించారు. లైఫ్ సపోర్ట్‌పై ఉంచి వైద్యులు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.డి. సుధాకర్ కర్ణాటక రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ప్రణాళిక, గణాంకాల శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఆయన, చిత్రదుర్గ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. మొత్తం నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుధాకర్ 2008లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.హిరియూరు నియోజకవర్గం నుంచి 2013, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించే నాయకుడిగా ఆయనకు మంచి పేరు ఉంది.సుధాకర్ మరణంపై సీఎం, మంత్రులు, వివిధ పార్టీల నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ప్రజాసేవ, రాజకీయ అనుభవాన్ని కొనియాడుతూ నివాళులర్పిస్తున్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు