Breaking News

ఇంధన పొదుపు దిశగా గవర్నర్ నిర్ణయం.. కాన్వాయ్‌లో వాహనాల కుదింపు

మే 15, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన పొదుపుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పిలుపుకు స్పందిస్తూ తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారిక కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను తగ్గిస్తూ ఇంధన వినియోగ నియంత్రణకు చర్యలు ప్రారంభించారు.రాజ్‌భవన్‌లో కూడా వాహనాల వినియోగాన్ని సగానికి తగ్గించినట్లు గవర్నర్ వెల్లడించారు. ప్రభుత్వ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇంధన పొదుపు చర్యల్లో భాగస్వామ్యం కావాలని గవర్నర్ సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు కూడా ఈ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.ప్రజలు కూడా అవసరం లేని వాహన వినియోగాన్ని తగ్గించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. చిన్న చిన్న మార్పులతో పెద్ద స్థాయిలో ఇంధన పొదుపు సాధ్యమవుతుందని తెలిపారు.పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ఇంధన పొదుపుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రధాని పిలుపును ఆచరణలో పెట్టే దిశగా తెలంగాణ గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *