Breaking News

జూన్ 21న నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్.. ఎన్టీఏ అధికారిక ప్రకటన

మే 15, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. జూన్ 21న రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఎన్టీఏ అధికారికంగా వెల్లడించింది.గతంలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో ప్రశ్నాపత్రం లీకేజీ, అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర అనుమతితో రీ-ఎగ్జామినేషన్ నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది.పరీక్ష నిర్వహణలో ఈసారి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ప్రశ్నాపత్రాల భద్రత, డిజిటల్ మానిటరింగ్, పరీక్షా కేంద్రాల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు, పరీక్షా కేంద్రాల వివరాలు త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని ఎన్టీఏ సూచించింది.రీ-ఎగ్జామ్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రిపరేషన్ కొనసాగించాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *