Breaking News

హైదరాబాద్‌లో అనుమానాస్పద మృతి.. సీఏ విద్యార్థి మృతదేహంపై గాయాలు

మే 15, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ మియాపూర్‌లో సీఏ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. గోకుల్ ప్లాట్స్‌లో నివాసం ఉంటున్న జనార్దన్ అనే విద్యార్థి తన గదిలో మృతదేహంగా కనిపించాడు.ఘటనా స్థలిలో జనార్దన్ ఉరేసుకున్నట్లు కనిపించినప్పటికీ, ఒంటినిండా రక్తపు మరకలు ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది సాధారణ ఆత్మహత్య కాదని, ఘటన వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపిస్తున్నారు.“మా కుమారుడు ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదు” అంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *