Breaking News

బండి భగీరథ్ పోక్సో కేసులో కొత్త ట్విస్ట్.. బాధితురాలి తల్లి లేఖ సంచలనం

మే 15, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో బాధితురాలి తల్లి విడుదల చేసిన లేఖ సంచలనంగా మారింది. తన కుమార్తెకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ పోరాటం చేస్తున్నామని, దీనికి రాజకీయ సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు2025లో తన కుమార్తెకు భగీరథ్‌తో పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత శారీరక సంబంధాల కోసం ఒత్తిడి తెచ్చాడని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా 2025 డిసెంబర్ 31న మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఘటనలను లేఖలో ప్రస్తావించారు. మద్యం సేవించమని బలవంతం చేసి అనుచితంగా ప్రవర్తించాడని పేర్కొన్నారు.ఈ ఘటనలకు సంబంధించిన చాట్స్, మెసేజ్‌లు, డిజిటల్ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, నిందితుడు క్షమాపణలు కోరిన సందేశాలు కూడా ఉన్నాయని ఆమె వెల్లడించారు. మే 8న పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించినప్పటికీ వెంటనే కేసు నమోదు చేయలేదని ఆరోపించారు.ఐదు గంటల పాటు పోలీస్ స్టేషన్‌లో నిరీక్షింపజేశారని, ఒత్తిడి చేసిన తర్వాతే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆమె పేర్కొన్నారు. అనంతరం సిట్ ఏర్పాటు కావడంతో విచారణ వేగవంతమైందని తెలిపారు.ఈ వ్యవహారంలో రాజీ ప్రయత్నాలు, బెదిరింపులు ఎదురయ్యాయని కూడా బాధితురాలి తల్లి ఆరోపించారు. తమ కుటుంబంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని, రక్షణ కల్పించాలని మహిళా కమిషన్, న్యాయవ్యవస్థను కోరారు.ఇదే సమయంలో భగీరథ్‌పై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. పోలీసులు కూడా ఆయన కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

ఓటర్ల జాబితా సవరణపై బీజేపీని లక్ష్యంగా చేసుకున్న మహేశ్ గౌడ్

ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల అధికారితో కాంగ్రెస్ నేతల భేటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *