బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

జలమండలి జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు

జలమండలి జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు

మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ జలమండలికి చెందిన రెడ్‌హిల్స్ జీఎం కుమార్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. మల్లాపూర్‌లోని ఆయన నివాసంతో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ తనిఖీల్లో భారీ స్థాయిలో నగదు, ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న నగదును మెషీన్ల సహాయంతో లెక్కిస్తున్నారు.ప్రాథమికంగా రూ.1.10 కోట్ల నగదు, హైదరాబాద్‌లో 3 ఫ్లాట్లు, 6 ప్లాట్లు, నిజామాబాద్ జిల్లాలో 3 ఎకరాల భూమి, కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.పలు కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు లాకర్ల వివరాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్న ఏసీబీ, ఆస్తుల మూలాలపై దర్యాప్తు కొనసాగిస్తోంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి