బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

వడగాలులపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

వడగాలులపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

మే 20, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో తీవ్ర వడగాలులు, ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగినంతగా అందుబాటులో ఉంచాలని, తాగునీరు మరియు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బకు గురైన వారికి వెంటనే వైద్యసాయం అందించాలని ఆదేశించారు.పట్టణ ప్రాంతాల్లో అవసరమైన చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం పేర్కొన్నారు. ప్రజలు సాధ్యమైనంత వరకు మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కలెక్టర్లకు అవసరమైన సూచనలు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి