బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఫ్యూచర్ సిటీ అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

ఫ్యూచర్ సిటీ అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

మే 20, (నేటి తెలుగు పత్రిక): పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్‌సీహెచ్‌ఆర్‌డీలో సమీక్ష నిర్వహించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులు, పరిశ్రమల ఏర్పాటు, మౌలిక వసతుల అభివృద్ధిపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఫ్యూచర్ సిటీ డిజైన్లు నెట్ జీరో సిటీ తరహాలో ఉండాలని సీఎం సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని, ఇందులో ఎలాంటి రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. ప్రపంచ స్థాయి నగరాలను అధ్యయనం చేసి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పూర్తయ్యాకే భూ కేటాయింపులు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఫ్యూచర్ సిటీకి ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టుల నివాసాల కోసం 500 ఎకరాలు కేటాయించాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ క్లస్టర్‌ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని, అవసరమైతే ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేస్తామని పేర్కొన్నారు.జూన్ నెలలో ఫ్యూచర్ సిటీ ఇండస్ట్రియల్ పార్క్‌లో పరిశ్రమల శంకుస్థాపనలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భూ కేటాయింపు వెంటనే పరిశ్రమల నిర్మాణం ప్రారంభించేలా నిబంధనలు రూపొందించాలని ఆదేశించారు.రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు “ఇన్వెస్ట్ తెలంగాణ” పేరుతో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సీఎం వెల్లడించారు. ఇందుకు ఆకర్షణీయమైన లోగో, ప్రత్యేక వెబ్‌సైట్, ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని సూచించారు. పెట్టుబడిదారులకు సహకరించేందుకు “ఎస్కార్ట్ ఆఫీసర్” వ్యవస్థను తీసుకురావాలని సీఎం ప్రతిపాదించారు. గ్రూప్-1 స్థాయి అధికారులను ఈ బాధ్యతలకు నియమించే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు.తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం భూసేకరణ ప్రారంభించాలని చెప్పారు.రాష్ట్రంలో 1500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటు చేయాలని, డేటా సెంటర్ల నీటి అవసరాలకు ఎస్‌టీపీలను వినియోగించాలని సూచించారు. కరీంనగర్, వరంగల్, విజయవాడ రహదారుల సమీపంలో జీసీసీలు, డేటా సెంటర్ల కోసం ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆదేశించారు.ద్వితీయ శ్రేణి నగరాల్లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల ఏర్పాటు కోసం ప్రత్యేక పాలసీ రూపొందించాలని సీఎం సూచించారు. మూడు నెలల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు టీ-ఫైబర్‌కు కనెక్ట్ కావాలని స్పష్టం చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి