బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కూరగాయల ఉత్పత్తి పెంచాలి.. బ్యాంకులకు మంత్రి తుమ్మల సూచనలు

కూరగాయల ఉత్పత్తి పెంచాలి.. బ్యాంకులకు మంత్రి తుమ్మల సూచనలు

మే 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ప్రతి ఏడాది సుమారు రూ.4,500 కోట్ల విలువైన కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.రాష్ట్రంలో కూరగాయలతో పాటు మామిడి, పసుపు, ఆయిల్ పామ్ వంటి ఉద్యాన పంటల సాగుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పంటలు కేవలం 6 శాతం సాగుభూమిలోనే పండుతున్నప్పటికీ, వ్యవసాయ స్థూల విలువలో వీటి వాటా 25 శాతంగా ఉండటం విశేషమన్నారు.ఉద్యాన పంటల విస్తరణకు బ్యాంకులు ప్రాధాన్యంగా రుణాలు అందించాలని తుమ్మల సూచించారు. ముఖ్యంగా రాష్ట్రంలోని దాదాపు 30 శాతం సాగుభూమిలో కౌలురైతులే వ్యవసాయం చేస్తున్నారని, వారికి కూడా సులభంగా రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.వ్యవసాయ రంగంలో విలువ ఆధారిత పంటలకు ప్రోత్సాహం కల్పిస్తే రైతుల ఆదాయం పెరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి