బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మేడ్చల్‌లో టెర్రరిస్టులతో టచ్‌లో ఉన్న వ్యక్తి అరెస్ట్

మేడ్చల్‌లో టెర్రరిస్టులతో టచ్‌లో ఉన్న వ్యక్తి అరెస్ట్

మే 24, (నేటి తెలుగు పత్రిక): మేడ్చల్ పరిధిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జయీద్ ఖాన్ అనే వ్యక్తి పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ మద్దతు ఉన్న ముఠాలతో సంబంధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా దేశ వ్యతిరేక శక్తులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం. నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాట్సాప్ చాట్స్, వాయిస్ కాల్స్, ఇతర డిజిటల్ ఆధారాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.దేశ భద్రతకు విఘాతం కలిగించే అంశాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. నిందితుడికి మరెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా? ఏవైనా సున్నితమైన సమాచారాన్ని పంపించాడా? అనే దానిపై కూడా విచారణ జరుగుతోంది.ఈ ఘటనతో మేడ్చల్ ప్రాంతంలో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. సోషల్ మీడియా వేదికలను ఉపయోగించి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి