బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ముందు ప్రజెంట్ సిటీని పట్టించుకో రేవంత్: కేటీఆర్

ముందు ప్రజెంట్ సిటీని పట్టించుకో రేవంత్: కేటీఆర్

మే 24, (నేటి తెలుగు పత్రిక): ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై మాట్లాడే ముందు ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ నగర సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. అంబర్‌పేట్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. నగరంలో మౌలిక వసతుల పరిస్థితిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.హైదరాబాద్‌లో రోడ్లు దెబ్బతిన్నాయని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని కేటీఆర్ విమర్శించారు. దోమల నివారణ చర్యలు కూడా సక్రమంగా చేపట్టడం లేదని ఆరోపించారు. నగర అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ఆయన అన్నారు.ఒకవైపు ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, కానీ ప్రస్తుతం ఉన్న నగరాన్ని సక్రమంగా నిర్వహించడంలో విఫలమవుతోందని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యలపై ముందుగా దృష్టి పెట్టాలని సూచించారు.ప్రస్తుతం ఉన్న హైదరాబాద్‌ను అభివృద్ధి చేయలేని ప్రభుత్వం భవిష్యత్ నగర నిర్మాణం ఎలా చేపడుతుందని ఆయన ప్రశ్నించారు. నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత కావాలని కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి