Breaking News

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

📌 ముఖ్యాంశాలు:

దేశమంతా సుభిక్షంగా, ధర్మమార్గంలో, శాంతి-ఐక్యతలతో ఉన్నత భవిష్యత్తు వైపు సాగాలని ప్రార్థన

పూరీ జగన్నాథుని రథయాత్ర సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భక్తులకు శుభాకాంక్షలు — ఎక్స్ వేదికగా భక్తిపూర్వక సందేశం

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

రథయాత్ర కేవలం ఉత్సవం కాదని, భగవంతునికి భక్తునికి మధ్య ఉండే శాశ్వత ఆధ్యాత్మిక అనుబంధానికి ప్రతీక అని అభివర్ణన

జగన్నాథస్వామి, బలభద్రస్వామి, సుభద్రాదేవిల ఆశీస్సులు ప్రతి కుటుంబానికి శాంతిని, మానసిక బలాన్ని ప్రసాదించాలని ఆకాంక్ష

పూరీ జగన్నాథుని పవిత్ర రథయాత్ర సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్నాథుని ఆశీస్సులతో దేశమంతా సుభిక్షంగా, శాంతిసంతోషాలతో విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు.రథయాత్ర కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదని, అది అచంచలమైన విశ్వాసానికి, భక్తికి ప్రతీక అని పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. జగన్నాథస్వామి, బలభద్రస్వామి, సుభద్రాదేవిల దివ్య ఆశీస్సులు ప్రతి కుటుంబానికి మానసిక బలాన్ని, ప్రతి జీవితానికి కొత్త ఆశను ప్రసాదించాలని కోరుకున్నారు. కలియుగ దైవం అందరినీ ధర్మమార్గంలో నడిపించి, శాంతి, ఐక్యత, ఆధ్యాత్మిక బలంతో కూడిన ఉన్నత భవిష్యత్తు వైపు సమాజాన్ని నడిపించాలని ఆయన ఆకాంక్షించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *