Breaking News

Massive fire in Balapur

బాలాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ బాలాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ పరిధిలోని బాలాపూర్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాల ప్రకారం, ఓ ప్లాస్టిక్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోడౌన్‌లో ఎగిసిపడుతున్న మంటలను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అదృష్టవశాత్తూ, రాత్రి వేళ గోడౌన్‌లో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు.

అయితే, ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *