Breaking News

Congress has eaten grass to eat.

గట్టెక్కడానికి గడ్డి తిన్న కాంగ్రెస్.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు

తెలంగాణలో కాంగ్రెస్‌పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు

బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలు కాంగ్రెస్‌కు ఉరితాళ్లుగా మారబోతున్నాయని హేళన చేశారు. “గట్టెక్కడానికి గడ్డి తిన్న కాంగ్రెస్.. అమలు చేయమంటే ఆర్థిక పరిస్థితి బాగోలేదని సాకులు చెబుతోంది” అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.

“హామీలు అమలు చేయండి.. లేకపోతే అధికారం విడిచి పెట్టండి”

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ, “అసెంబ్లీ స్పీకర్ స్వయంగా హామీల అమలుపై సందేహం వ్యక్తం చేయడం కాంగ్రెస్ మోసపూరిత ధోరణికి నిదర్శనం” అని పేర్కొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • “ఆర్థిక పరిస్థితి తెలియక హామీలు ఇచ్చామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అంటున్నారు. ఇది ప్రజలను మోసం చేసినట్లు కాదు?” అని ప్రశ్నించారు.
  • “వంద రోజుల్లో 420 హామీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట తప్పింది” అన్నారు.
  • “రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయారు. ప్రజలు తిరగబడుతున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు” అని గుర్తు చేశారు.

“రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?”

  • రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారు
  • మహిళలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారు
  • హామీలు ఇచ్చి మొండి చెయ్యి చూపిస్తే బీజేపీ ఊరుకోదు

“ఉద్యోగులకు కాంగ్రెస్ న్యాయం చేసిందా?”

తెలంగాణలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి ఇప్పటికీ మౌనం వహిస్తోందని లక్ష్మణ్ ధ్వజమెత్తారు.

  • “ఎనిమిది వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదు”
  • “కేసీఆర్ హామీ ఇచ్చి మూడు సంవత్సరాలు ఆలస్యం చేసాడు, కానీ కాంగ్రెస్ తక్షణమే అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు మౌనంగా ఉంది”
  • “రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోకుండా పదవి విరమణ చేసిన ఉద్యోగులను గోసపడేలా చేస్తున్నారు”

“ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బ్రేకులు వేయాలి”

బీజేపీ అభ్యర్థులను గెలిపించి తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు మద్దతు ఇవ్వాలని లక్ష్మణ్ కోరారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్
  • “కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఎన్నికల తర్వాత మరిచిపోయారు”
  • “స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉంది. ప్రజలు కాంగ్రెస్ మోసాన్ని గుర్తించి తగిన గుణపాఠం చెప్పాలి” అని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *