Breaking News

Full support for 'Lakh Drums-Thousand Voices'

లక్ష డప్పులు-వేయి గొంతులు’కు పూర్తి మద్దతు

లక్ష డప్పులు-వేయి గొంతులు’కు పూర్తి మద్దతు – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

హైదరాబాద్: ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘లక్ష డప్పులు-వేయి గొంతులు’ దండోరా సాంస్కృతిక మహా ప్రదర్శనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడించారు. బుధవారం వైజంక్షన్ వద్ద నిర్వహించిన దండోరా కార్యక్రమంలో పాల్గొని డప్పు కొడుతూ ప్రజలతో కలిసి సందడి చేశారు.

ఎస్సీ వర్గీకరణపై కీలక వ్యాఖ్యలు

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాధవరం కృష్ణారావు, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఎస్సీ వర్గీకరణకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి వర్గీకరణ అమలుపై వినతిపత్రం సమర్పించినప్పటికీ, ఏడాది గడిచినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపై ఎటువంటి చర్య తీసుకోలేదని విమర్శించారు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘లక్ష డప్పులు-వేయి గొంతులు’ కార్యక్రమానికి ప్రభుత్వం ఎలాంటి అవరోధాలు కలిగించకుండా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


సీఎం రేవంత్ రెడ్డికి యుగంధర్ రెడ్డి కృతజ్ఞతలు

కూకట్‌పల్లి కాంగ్రెస్ ఏ బ్లాక్ ఉపాధ్యక్షుడు మాదిరెడ్డి యుగంధర్ రెడ్డి, శాసనసభ, శాసనమండలిలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలానగర్‌లో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

ఎస్సీ వర్గీకరణ బిల్లును అమలుచేసి, మాదిగలకు న్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని యుగంధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కలలుగన్న సామాజిక న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.

మందకృష్ణ మాదిగకు అభినందనలు

ఎస్సీ వర్గీకరణ కోసం పాటుపడిన మందకృష్ణ మాదిగకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో మాదిగలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని యుగంధర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ‘లక్ష డప్పులు-వేయి గొంతులు’ దండోరా ప్రదర్శన, ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వ చర్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *