Breaking News

Low-cost Internet services

తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు

తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, డిసెంబర్ 08, 2024

రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను మరింత విస్తరించేందుకు టీ-ఫైబర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంటింటికీ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో మంత్రి శ్రీధర్ బాబు ఆదివారం ఈ సేవలను ప్రారంభించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రజావిజయోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు

టీ-ఫైబర్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కేవలం రూ.300కు ఇంటర్నెట్ కనెక్షన్ అందించనున్నట్లు మంత్రి తెలిపారు. టీవీ, ఫోన్, ఓటీటీ ప్లాట్ఫార్మ్‌లకు ఇంటర్నెట్ సౌకర్యం అందేలా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

మీసేవ మొబైల్ యాప్ ప్రారంభం

ఈ కార్యక్రమంలో భాగంగా మీసేవ మొబైల్ యాప్‌ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. రైతుల రుణమాఫీ, బోనస్ కోసం కొత్త సేవలను ఈ యాప్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు.

ప్రథమ దశ అమలు

నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2,096 గ్రామ పంచాయతీలలో మొదట ఈ సేవలను అమలు చేయనున్నారు. తర్వాత దశల వారీగా రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఈ సేవలను విస్తరించనున్నారు.

సాంకేతికత అందరి కోసం

టీ-ఫైబర్ ఇంటర్నెట్ వైఫై కనెక్షన్‌ తరహాలో పనిచేస్తూ, టీవీతో పాటు మొబైల్, కంప్యూటర్ వినియోగానికి సౌకర్యం కల్పిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీకి కొత్త ఒరవడి పెట్టడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *